ys jagan : ఔనా జగన్.. నీ రోజు వారి సంపాదన రూ.300 కోట్లా?
ys jagan : ఏపీ సీఎం జగన్ వేల కోట్ల ఆస్తిపరుడని ఆయన రోజు వారి సంపాదన రూ. 300 కోట్లు అంటూ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నాడు. ఆయన వ్యాపారాలతో భారీ లాభాలను ఆయన దక్కించుకుంటున్నాడు. ఆయన కుటుంబ ఆస్తులు రోజు రోజుకు వందల కోట్ల పరిధిలో పెరుగుతూ వస్తున్నాయంటూ ఈ సందర్బంగా జేసీ దివాకర్ రెడ్డి అన్నాడు. 2019 ఎన్నికల సమయంలో రాజకీయ సన్యాసం తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి అనూహ్యంగా అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇలా వైరల్ అయ్యే వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా జనాలకు కాస్త పని చెబుతూ ఉంటాడు. తాజాగా సీఎం జగన్ ఆస్తుల గురించి జేసీ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచాయి.
అధికార పార్టీ అధినేత సంపాదన ఆమాత్రం ఉండకుంటే ఎలా..
ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా తమ వారికి దాచి పెట్టడం దోచి పెట్టడం అనేది చాలా కామన్ విషయాలు. ఈ విషయంలో వైఎస్ జగన్ ఒక ఆకు ఎక్కువే చదివాడు అనేది కొందరి వాదన. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ ను జేసీ విమర్శిస్తున్నట్లుగా ఆయన రోజు వారి సంపాదన రూ.300 కోట్లు ఉండక పోవచ్చు అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం అంతకు మించి ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం జగన్ ఆదాయం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యి ఉంటాయని అంటున్నారు. సీఎం జగన్ ఆస్తులు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే లక్ష కోట్లు అంటూ ప్రచారం జరిగింది. కనుక ఇప్పుడు అది ఎక్కువ అయ్యి కూడా ఉండవచ్చు అంటున్నారు.
అంతా జగన్ వారే..
ఏపీలో ఇప్పుడు లిక్కర్ బిజినెస్ నుండి మొదలుకుని పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ల కాంట్రాక్ట్ వరకు అందరు కూడా జగన్ కు సంబంధించిన వారే ఉన్నారు అనేది ప్రతిపక్షం ఆరోపణ. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల విలువ అంతకంతకు పెరుగుతున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ముడుపులు అందుకోవడంతో పాటు అక్రమంగా తన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించుకోవడం అనేది జగన్ కు ముందు నుండి ఉన్న అలవాటే కనుక ఆయన ఆదాయం అంతగా పెరిగింది అంటే మామకు మాత్రం ఆశ్చర్యం లేదని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంటున్నారు. ఇంతకు వైఎస్ జగన్ గారు మీ ఆస్తుల విలువ అంత ఉందా మరి..?