Ys Jagan : జగన్ ను ప్రజలనుండి దూరం చేసింది ఆయనేనా..?
ప్రధానాంశాలు:
Ys Jagan : జగన్ ను ప్రజలనుండి దూరం చేసింది ఆయనేనా..?
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం గతాన్ని మళ్లీ గుర్తు చేసేలా మాట్లాడుతున్నారు. “మేము చేసిన మంచే మళ్లీ గెలిపిస్తుంది” అనే వాదనను ఆయన మళ్లీ పునరావృతం చేయడం విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో సజ్జల పాత్ర ఎంత ప్రధానమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ కంటే ఎక్కువగా మీడియా దృష్టిలో ఉండడం, మంత్రుల స్థానంలో మాట్లాడటం వంటి అంశాలు ఆయన్ను విమర్శల పాలు చేశాయి. అంతేకాదు, జగన్‌ను ప్రజల నుంచి దూరం చేసినవాడిగా కూడా ఆయనపై విమర్శలు వచ్చాయి.

Ys Jagan : జగన్ ను ప్రజలనుండి దూరం చేసింది ఆయనేనా..?
Ys Jagan : సజ్జల వల్లే వైసీపీ ఓటమి ?
సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు భార్గవ్ ల పాత్ర పట్ల వైసీపీ లోపలి శిబిరంలో విమర్శలు ఎక్కువవుతున్నాయి. పార్టీ నేతలు జగన్‌ను కలవాలంటే సజ్జల అడ్డుకట్టగా మారాడని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో సజ్జల భార్గవ్ సోషల్ మీడియా బాధ్యతలు చేపట్టిన తీరు కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి వీరి నిర్ణయాలు కారణమయ్యాయని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. పైగా విజయసాయిరెడ్డి వంటి కీలక నేత కూడా సజ్జల వ్యవహారశైలిపై అసంతృప్తితో రాజీనామా చేశారని ప్రచారం జరిగింది.
Ys Jagan : సజ్జల ధీమా – జనాలు మళ్లీ గెలిపిస్తారు
ఇప్పటికీ సజ్జల ధీమాగా మాట్లాడుతుండటం విశేషం. జగన్ ప్రభుత్వం సామాజిక న్యాయంపై దృష్టి పెట్టిందని, ఐదు కోట్ల మందిని నేరుగా టచ్ చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీనేనని పేర్కొన్నారు. పేదల అభివృద్ధే తమ లక్ష్యమని, వారిని ఎత్తి పడేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పాటుపడిందని చెప్పారు. జగన్ పాలనలో సమానత్వం, న్యాయం, అభివృద్ధి, సంక్షేమం అన్నీ సమపాళ్లలో జరిగాయని ఆయన వాదించారు. అయితే, ప్రజల అభిప్రాయంలో మార్పు వచ్చేలా పార్టీలో పాత వ్యవస్థలపై మళ్లీ తిరుగుబాటు అవసరమన్నదే పలు వర్గాల అభిప్రాయం.