YS Jagan : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో దేశం తన వైపు చూసేలా చేసుకున్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. కాగా 2024లో వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లారు ఆయన. కానీ తాను ఒకటి తలిస్తే ఏపీ ప్రజలు మరొకటి తలిచారు. ఘోరంగా ఓడించారు. అయితే ఇంత ఘోర ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అంతులేని మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించి గెలుపు వరమాలను వేసిన ప్రజలు అంతకుమించి ఓటమిని కట్టబెట్టడానికి మధ్య కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం జగన్ పై ఉంది. వైఫల్యాలను అధిగమించి ముందుకెళ్లాలి. పార్టీ శ్రేణులను సమాయత్తపరిచి కూటమి ప్రభుత్వంపై పోరాటం పోరాడాలి. తాను పలావ్ పెట్టాను. చంద్రబాబు బిర్యానీ పెట్టారు. ఆ బిర్యానీకి నచ్చే వారంతా చంద్రబాబు వెంట వెళ్లారు. ఇప్పుడు పస్తులతో గడుపుతున్నారంటూ జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు
. ఇంకా ఆ సంక్షేమ పథకాల భ్రమలోనే ఆయన ఉన్నట్టున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు ఓటు వేస్తారని భావించారు. ఇప్పుడు ఇచ్చింది చెప్పడం కాదు. వైఫల్యాలను అధిగమించి కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తించేలా చేయాలి. అలా చేయాలంటే పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలకు పార్టీ నాయకులు కలిసి రావాలి. విలువలు, విశ్వసనీయతల నమ్మి తాను రాజకీయం చేస్తున్నానని జగన్ చెప్పుకొస్తున్నారు. బలం లేకపోతే పోటీ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కూటమికి బలం లేకున్నా పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సదర్భంగా ప్రస్తావిస్తున్నారు. దాన్ని అధర్మ పోరాటంగా అభివర్ణిస్తున్నారు.
వైసిపి హయాంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అధికార పార్టీగా ఉన్న ఆ ఎమ్మెల్సీ స్థానాలను వదులుకునేందుకు వైసీపీ ఇష్టపడలేదు. సాధారణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు దక్కించుకునేవి. వాటిపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టేవి కావు. కానీ శాసన మండలిని చుట్టేయాలని జగన్ భావించారు. ఆ స్థానాల్లో సైతం పోటీ చేసి ఎమ్మెల్సీలను హస్తగతం చేసుకున్నారు. దాంతో విలువలు, విశ్వసనీయతల గురించి జగన్ మాట్లాడుతుండడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
వారు దూరం జరుగడంతో అధికారం దూరం..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో జగన్ మాట్లాడారు. తన వైఫల్యాన్ని స్పష్టంగా ఒప్పుకున్నారు. గతంలో తనను అభిమానించిన వర్గాల్లో 10 శాతం మంది చేజారిపోయారన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన పాలనా వైఫల్యాన్ని పరోక్షంగా అంగీకరించారు. తాను నచ్చకో.. లేకుంటే చంద్రబాబు హామీలకు లొంగిపోయో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గు చూపారని అందుకే తనకు ఓటమి ఎదురైందన్నారు. మొత్తానికి జగన్ ఇప్పుడిప్పుడే తన ఓటమిని అంగీకరిస్తున్నారు. అందుకు కారణాలనూ చెబుతుండటం విశేషం.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.