YS Jagan : జగన్‌కు శాపంగా మారనున్న వరం..?
YS Jagan : 2019 సాధారణ ఎన్నికలకు ముందర పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పాదయాత్ర సందర్భంగా పలు హామీలిచ్చి అత్యధిక మెజారిటీతో ఎన్నికల్లో గెలుపొందారు. ఈ క్రమంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేందుకుగాను జగన్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే, అలా చేయడం ఆయనకు వరంగా మారింది. తాను ఇచ్చిన హామీల ప్రకారం ఎన్నిక ఆర్థికపరమైన కష్టాలున్నప్పటికీ జగన్ నిధులను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందజేస్తున్నాడు.
YS Jagan : శాపంగా పరిణమించే చాన్స్..!
పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు వైసీపీ అధినేత జగన్ ..ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అప్పులు తెచ్చి అయినా సరే నిధులు అందజేస్తున్నాడు. ఇలా చేయడం ఆయనకు ప్రజల నుంచి ఒక వరం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జగన్ ఎన్ని కష్టాలున్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటాడనే నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడింది. ప్రజల్లో ఆయన భరోసా కనిపిస్తాడనే విశ్వాసం కూడా పెరిగింది. అలా చెప్పిన సమయానికి చెప్పినట్లుగా విధిగా బ్యాంకు అకౌంట్లలో లబ్ధిదారులకు నగదు జమ చేస్తున్నారు. ఇందుకుగాను అవసరమైన బడ్జెట్ రూపొందించుకుంటున్నాడు. ఇప్పటి వరకు మొత్తంగా రూ.లక్ష కోట్ల నగదు ప్రజలకు వివిధ పథకాల కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ నగదు మళ్లీ మార్కెట్‌లోకి రావడం పట్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా బలపడింది కూడా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలా ఉద్యోగులకు వేతనం ఇవ్వడంలో ఆలస్యం అయినప్పటికీ సంక్షేమ పథకాలకు మాత్రం ఆలస్యం ఉండబోదు అనే నమ్మకాన్ని జగన్ క్రియేట్ చేశాడు. అయితే, ఇదే సమయంలో జగన్ ప్రజా సొమ్మును పప్పు బెల్లంలాగా పంచి పెడుతున్నారని విమర్శలూ వస్తున్నాయి. పథకాలు అందిన లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని, కానీ, అందనివారి పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మధ్యతరగతి ప్రజానీకం, నిరుద్యోగ లోకం జగన్ సర్కారు పట్ల అసహనం వ్యక్తం చేస్తోంది. అలా ఏపీలోని 70 శాంత మందిలో జగన్ సర్కారు పట్ల వ్యతిరేకత ఉన్నట్లు కనబడుతోంది. అలా జగన్ సంక్షేమ పథకాలు అప్పటి వరకు వరంగా కనబడినప్పటికీ చివరకు శాపంగా పరిణమించే చాన్సెస్ కనబడుతున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.