Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 January 2026,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..!

Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని మళ్లీ పటిష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతి సమీపంలోని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ యాత్ర ప్రధానంగా పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో నేరుగా మమేకం కావడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం నిర్వహించనున్నట్లు జగన్ స్పష్టం చేశారు.

Ys jagan వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం మ‌ళ్లీ పాద‌యాత్ర‌

Ys jagan : వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌..!

Ys jagan కొత్త వ్యూహం..

కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండగట్టడమే కాకుండా, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీకి బలమని, వారి వెనక తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ తరఫున ఇంతటి పెద్ద కార్యాచరణ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. 16 నెలల పాటు సాగిన ఆ యాత్రలో ఆయన ప్రజల సమస్యలను నేరుగా వినడం ద్వారా విశేషమైన ప్రజాదరణ సంపాదించుకున్నారు. అదే యాత్ర 2019 ఎన్నికల్లో వైసీపీకి చారిత్రక విజయానికి బాట వేసిందన్న అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉంది.

ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి తిరిగి నిర్మించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బలమైన క్యాడర్, స్పష్టమైన కార్యాచరణ అవసరమని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లిలో జరిగిన ఈ సమావేశంలో ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ అలా జయప్రకాష్ (నాని), పార్లమెంటు ఇంఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం ఈ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రారంభ తేదీ, యాత్ర పేరు వంటి వివరాలు ఖరారు కాలేదు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తామని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. జగన్ తాజా నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది