
Ys jagan : వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. మళ్లీ పాదయాత్ర..!
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీని మళ్లీ పటిష్టంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతి సమీపంలోని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ యాత్ర ప్రధానంగా పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో నేరుగా మమేకం కావడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం నిర్వహించనున్నట్లు జగన్ స్పష్టం చేశారు.
Ys jagan : వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. మళ్లీ పాదయాత్ర..!
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎండగట్టడమే కాకుండా, పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీకి బలమని, వారి వెనక తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ తరఫున ఇంతటి పెద్ద కార్యాచరణ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జగన్ చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాష్ట్ర రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. 16 నెలల పాటు సాగిన ఆ యాత్రలో ఆయన ప్రజల సమస్యలను నేరుగా వినడం ద్వారా విశేషమైన ప్రజాదరణ సంపాదించుకున్నారు. అదే యాత్ర 2019 ఎన్నికల్లో వైసీపీకి చారిత్రక విజయానికి బాట వేసిందన్న అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉంది.
ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి తిరిగి నిర్మించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు బలమైన క్యాడర్, స్పష్టమైన కార్యాచరణ అవసరమని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడేపల్లిలో జరిగిన ఈ సమావేశంలో ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ అలా జయప్రకాష్ (నాని), పార్లమెంటు ఇంఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం ఈ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రారంభ తేదీ, యాత్ర పేరు వంటి వివరాలు ఖరారు కాలేదు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తామని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. జగన్ తాజా నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
సినిమా రంగంలో పాత సూపర్ హిట్ చిత్రాల టైటిళ్లను మళ్ళీ వాడుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ఒక సినిమా…
Chiranjeevi Davos : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) సదస్సు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర…
Kisan Vikas Patra 2026 : డబ్బు పొదుపు చేయడం చాలామందికి సాధ్యమే. కానీ ఆ పొదుపును ఎలాంటి రిస్క్…
This website uses cookies.