
Kodali Nani : కొడాలి నానికి వైఎస్ జగన్ షాక్.. ఈసారి గుడివాడ టికెట్ లేనట్లే..!
Kodali Nani : వైసీపీలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఫైర్ బ్రాండ్ గా పేరు ఉంది. అలాగే అతను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. అయితే కొడాలి నాని కి వైసీపీ షాక్ ఇవ్వనుందని చర్చ జరుగుతుంది. దానికి కారణం గుడివాడ ఎమ్మెల్యే సీటు విషయంలో వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఆలోచించడమే అని అంటున్నారు. కొడాలి నాని కి బదులుగా కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారని టాక్ నడుస్తుంది. గుడివాడలో సీనియర్ వైసీపీ నేత, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎం ఆఫీస్ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతుంది. దాంతో ఏకంగా గుడివాడలో హనుమంతరావుకే సీటు అని ఫ్లెక్సీలు వేశారు. ఇక గుడివాడలో కొడాలి నాని 2004 నుంచి ఓటమి ఎరగకుండా గెలుస్తూ వస్తున్నారు. ఆయన నాలుగు సార్లు అంటే రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 లో పోటీ చేస్తాను అని ఆయన ధీమాగా ఉన్నారు. అలాగే నాని వర్గం కూడా అదే ఆశతో ఉంది. గుడివాడ అంటే కొడాలి నాని అన్నట్లుగా ఈ సీటులో వేరే అభ్యర్థిని అసలు ఊహించడమే కష్టం.
కానీ ఈ సీటు విషయంలో వైయస్ జగన్ నిర్ణయం ఏమి తీసుకుంటారు అన్న చర్చ సాగుతుంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా కాపులు, ఎస్సీ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈసారి టీడీపీ కమ్మ ప్లస్ కాపు అన్న ప్రయోగంతో ముందుకు వెళుతుంది. కమ్మ అభ్యర్థిగా వెనిగండ్ల రాముని ఎంపిక చేసింది. టీడీపీ ఇక కాపుల మద్దతు జనసేన రూపంలో ఉంటుందని టిడిపి వెనిగండ్లను రంగంలోకి దించుతుంది. ఈ ఎన్ఆర్ఐ తో కొడాలి నాని కి చెక్ పెట్టాలని టీడీపీ చూస్తుంది. అయితే వైసీపీ చేసిన సర్వేలలో కొడాలి నానికి వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద కొడాలి నాని తీరు కమ్మ సామాజిక వర్గం అంత వ్యతిరేకంగా మారారు అని అంటున్నారు. దాంతోపాటు ప్రతిసారి గుడివాడను సమర్థించే కాపులలో కూడా చీలిక వస్తుందని, ఎస్సి ఓట్లు కూడా టీడీపీకి వస్తాయని అంచనాలు ఉన్నాయని అంటున్నారు.
దాంతో గుడివాడలో కొడాలి నాని బదులుగా హనుమంతరావు అభ్యర్థిగా ప్రకటించవచ్చని అంటున్నారు. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అని అంటున్నారు. గుడివాడలో ఎక్కువగా కాపుల ఓట్లు ఉన్నాయి. అలాగే వైసీపీ ఓటు బ్యాంకు అయినా ఎస్సీ మైనారిటీలను కలుపుకుంటే విజయం సాధించవచ్చు అని ఊహిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో గుడివాడ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొడాలి నాని ఈసారి టికెట్ దక్కదు అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. అది ఆయనకు బిగ్ షాక్ అని కూడా చెప్పవచ్చు. ఈసారి పోటీ చేసి రాజకీయాల నుంచి విరమించాలని కొడాలి నాని అనుకుంటున్నారు. మరి వైయస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడ ఎమ్మెల్యే టికెట్ ను ఎవరికి ఇస్తారో చూడాలి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.