Ys Jagan : రాత్రికి రాత్రి జగన్ సీరియస్ నిర్ణయం..?

Authored By Siddhu Manchikanti | The Telugu News | Published on: April 16, 2026, 7:30 pm
  •  Ys Jagan : రాత్రికి రాత్రి జగన్ సీరియస్ నిర్ణయం..?

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషిస్తే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఎక్కువగా బెంగళూరులోని తన నివాసానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు ప్రత్యర్థి పార్టీల నుండి గట్టిగా వినిపిస్తున్నాయి. వారానికి రెండు రోజులు బెంగళూరులో ఉండటం వల్ల కేడర్‌కు అందుబాటులో ఉండటం లేదనే అసహనం పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ తన రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా మార్చేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం. అందుకే ఆయన రాత్రికి రాత్రి తన మకాంను బెంగళూరు నుండి హైదరాబాద్‌కు మార్చాలని సీరియస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Ys Jagan : రాత్రికి రాత్రి జగన్ సీరియస్ నిర్ణయం..?

Ys Jagan : రాత్రికి రాత్రి జగన్ సీరియస్ నిర్ణయం..?

Ys Jagan : లోటస్ పాండ్ వేదికగా కొత్త వ్యూహాలు

జగన్ ఇప్పుడు తన పాత అడ్డా అయిన హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులో ఉండటం వల్ల కూటమి నేతలు తనను తరచూ టార్గెట్ చేస్తున్నారని భావించిన ఆయన ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయం నడపాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నేతలు కూడా హైదరాబాద్, ఏపీ మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. అదే బాటలో తాను కూడా హైదరాబాద్ నుండి కార్యకలాపాలు సాగిస్తే విమర్శించే అవకాశం ఉండదని జగన్ యోచిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీలోని కీలక నేతలు చాలా మంది హైదరాబాద్‌లోనే నివసిస్తుండటంతో వారితో ఎప్పటికప్పుడు చర్చలు జరపడానికి లోటస్ పాండ్ సరైన వేదిక అవుతుందని ఆయన భావిస్తున్నారు.

ఈ నిర్ణయంతో అటు పార్టీ నేతలకు ఇటు కార్యకర్తలకు జగన్ మరింత చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. తాడేపల్లి నివాసంలో ఉండే ఆంక్షల కంటే హైదరాబాద్‌లో స్వేచ్ఛగా నేతలను కలిసే వీలుంటుందని ఆయన నమ్ముతున్నారు. బెంగళూరు విమర్శలకు స్వస్తి పలికి కూటమి పార్టీలకు ధీటుగా సమాధానం చెప్పాలంటే హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేయడమే మేలని జగన్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఎవరూ ఊహించని విధంగా తన నివాసాన్ని మార్చేందుకు ఆయన సిద్ధపడ్డారు. త్వరలోనే లోటస్ పాండ్ నివాసంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి అక్కడి నుండి తన రాజకీయ పోరాటాన్ని తిరిగి ప్రారంభించబోతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.

Siddhu Manchikanti

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp