YS Jagan : తిరుమల కు జగన్ ఎంట్రీ ఉంటుందా.. ఏం జరగబోతుంది..?
ప్రధానాంశాలు:
YS Jagan : తిరుమల కు జగన్ ఎంట్రీ ఉంటుందా.. ఏం జరగబోతుంది..?
YS Jagan : ఏపీ లో తిరుమల లడ్డూ వివాదం చాలా సంచలనంగా మారింది. నెయ్యి లో కల్తీ జరిగిందని అధికార ప్రభుత్వం చెబుతుంది. దానికి గత ప్రభుత్వమే ప్రధాన కారణమని నొక్కి ఒక్కాడిస్తుంది. దాదాపు పది రోజులుగా ఈ వ్యవహారం నడుస్తుంది. ఐతే ఎవరికి తోచిన విధంగా వారు దీని గురించి మాట్లాడుతున్నారు. ఐతే ఈ ఇష్యూపై వైసీపీ అధినేత జాన్ స్పందిస్తూ ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు వైసెస్ జగన్ కాలి నడకన శ్రీవారి ఆలయానికి రావాలని నిర్ణయించుకున్నారు.
ఐతే జగన్ తిరుమల కాలి నడకన వస్తే మాత్రం చాలా హడావిడి జరుగుతుంది. జగన్ ఇలా తన యాత్ర ప్రకటించగానే మీడియాలో ఒకటే హంగామా మొదలైంది. ఐతే మీరు ఐదేళ్లుగా చేసిన నిర్వాకం వల్లే ఇలా జరిగిందని అంటూ అధికార పక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. జగన్ నాయకత్వంలోని ప్రభుత్వమే తిరుమల లడూ కల్తీ అయ్యిందని గట్టి వాదనలు వినిపిస్తున్నాయి.
YS Jagan జగన్ తిరుమలకు రావద్దని..
ఇక దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్ జగన్ తిరుమలకు రావద్దని సందేశం ఇచ్చారు. అంతేకాదు తిరుమల వ్యవాహారాలపై అసలు మాట్లాడే అహత కూడా వైసీపీకి ల్దని అన్నారు. వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఎవరికి వారు తమ వాదనలు వినిపిస్తున్నారు.
అంతేకాదు జగన్ కాలినడకన తిరుమల రావాలనే ఆలోచనని కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుంది. నెయ్యి కల్తీ చేసి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన దానికి ప్రాయశ్చితంగా చేయాలని అనుకున్నారు. జగన్ ప్రోగ్రాం సక్సెస్ అయితే అది కూటమి మీద వేసే బడ అన్నట్టే అవుతుంది. అందుకే తిరుమల జగన్ రాకను అడ్డుకోవాలని టీడీ చూస్తుంది. ఐతే పార్టీ పరంగా కాకునా హిందూ సంఘాలు, భక్తుల ఆందోళన లాగా చూపించి జగన్ తిరుమల రాకను అడ్డుకుంటారా అన్న చర్చ జరుగుతుంది.