Atchannaidu : అచ్చన్నాయుడుని జగన్ డీల్ చేసే స్టైల్ టోటల్ కొత్తగా ఉండే – సరికొత్త రాజకీయం ఇది !
Atchannaidu : టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు గురించి తెలుసు కదా. టీడీపీ హయాంలో ఆయన రెచ్చిపోయిన విధానం అందరికీ తెలుసు. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నోర్మూసుకొని ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఒళ్లు పెరిగింది కానీ.. బుర్ర పెరగలేదు. కాస్త బుర్ర కూడా పెంచుకోవయ్యా.. అని అచ్చెన్నాయుడికి సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అసలు.. సీఎం జగన్ ఎందుకు ఆ మాట అన్నారో ఇప్పుడు అర్థం అవుతోంది. నిజమే.. ప్రస్తుతం ముందస్తు ఎన్నికల విషయంపై ఏపీలో చర్చ నడుస్తోంది కదా. కానీ.. ఏపీలో ముందస్తుకు వెళ్లే అవకాశమే లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
కానీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం ముందస్తుకు వెళ్లే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో అచ్చెన్నాయడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవే ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశం అయ్యాయి. ప్రస్తుతం వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు.. అంటూ అచ్చెన్నాయుడు విమర్శలు చేయడంతో అసలు అచ్చెన్నాయుడికి బుర్ర ఉందా అని అందరూ అనుకుంటున్నారు. అసలు.. ముందస్తుకు వెళ్లే ఆలోచనే లేదని సీఎం జగన్ అంత స్పష్టంగా చెబితే అచ్చెన్నాయుడు మాత్రం ముందస్తుకు వెళ్లేందుకు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను జగన్ బతిమిలాడుకుంటున్నారు అంటూ పిచ్చి కూతలు కూశారు.ఒకవేళ ముందస్తుకు వెళ్లాలని సీఎం జగన్ అనుకుంటే మాత్రం.. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని బతిమిలాడాల్సిన అవసరం ఏంటి. కేంద్రమే ముందస్తుకు వెళ్లాలని భావిస్తుందే సీఎం జగన్ ముందస్తుకు వెళ్లమని ఎప్పుడో స్పష్టం చేశారు. అసలు సీఎం ఢిల్లీ పర్యటన ఎందుకో కూడా తెలియదు ఈ బుర్రలేని వారికి. అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికల సంఘమే ఆరు నెలల్లోపు ఎన్నికలను నిర్వహిస్తుంది.
Atchannaidu : ముందస్తుకు వెళ్లాలనుకున్నా.. కేంద్రాన్ని బతిమిలాడాల్సిన అవసరం ఏంటి?
అందులో కేంద్రాన్ని బతిమిలాడుకోవాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 2018 లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లలేదా? దానికి కేంద్రాన్ని బతిమిలాడాల్సిన అవసరం ఏంటి. అయినా నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం కాదు. బాడీ పెంచగానే కాదు. కాస్తయినా బుర్ర పెంచుకోవాలి అని అచ్చెన్నాయుడుకు వైసీపీ నేతలు సూచిస్తున్నారు.