Atchannaidu : ఉత్తరాంధ్రలో అచ్చన్నాయుడుకి టోల్ గేట్ పడింది.. ఇక ఇంపాజిబుల్
Atchannaidu : ఉత్తరాంధ్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికీ తెలియదు. ఉత్తరాంధ్రలో వైజాగ్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న జిల్లా శ్రీకాకుళం. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడును ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావిస్తోంది. అచ్చెన్నాయుడుకు శ్రీకాకుళం జిల్లాలో చాలా పాపులారిటీ ఉన్న నేత. అలాంటి పాపులారిటీ ఉన్న నేత అచ్చెన్నాయుడును ఓడిస్తే వైసీపీకి చాలా మైలేజ్ వస్తుందని భావించిన వైసీపీ అధిష్ఠానం అక్కడ ఎలాగైనా ఆయన్ను ఓడించాలని భావిస్తోంది. అందుకే.. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ను అక్కడ బరిలోకి దించి.. ఆయన ద్వారా అచ్చెన్నాయుడును ఓడించాలని వైసీపీ చూస్తోంది.
నిజానికి.. 2019 ఎన్నికల్లో టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోయాడు. అయినా సరే.. సీఎం జగన్ ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నాయుడును ఓడించేందుకు దువ్వాడ ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నాడు. ఓవైపు అచ్చెన్నాయుడుకు టెక్కలిలో ఎంత పాపులారిటీ ఉందో.. దువ్వాడకు కూడా అంతే పాపులారిటీ ఉంది. ఇద్దరూ ప్రజల కోసం తమ నియోజకవర్గంలో ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతూనే ఉంటాయి.
Atchannaidu : మూడు రాజధానుల అంశాన్నే కీలకంగా తీసుకోనున్న వైసీపీ
వచ్చే ఎన్నికల్లో వైసీపీ మాత్రం మూడు రాజధానుల అంశాన్నే కీలకంగా తీసుకోనుంది. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించగానే వైసీపీకి ఉత్తరాంధ్రలో కొంచెం పాజిటివిటీ కనిపిస్తోంది. దాన్నే క్యాష్ చేసుకొని వైసీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది. ప్రజల్లోకి వెళ్లనుంది. టీడీపీ మాత్రం కేవలం అమరావతి రాజధానినే పట్టుకొని కూర్చోవడంతో అది ఉత్తరాంధ్రలో మైనస్ అవుతోంది. ఓవైపు ఉత్తరాంధ్రకు మేలు చేయడానికి సీఎం జగన్.. వైజాగ్ ను పరిపాలన రాజధానిగా చేస్తుంటే టీడీపీ మాత్రం ఇంకా అమరావతినే పట్టుకొని వేలాడుతోందని ఉత్తరాంధ్ర ప్రజలు అంటున్నారు. అందుకే.. ఈసారి టీడీపీని కాకుండా వైసీపీనే గెలిపించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. ఈసారి వైసీపీ అచ్చెన్నాయుడును ఓడిస్తుందో లేదో?