Ys Jagan : ఈసారి వైఎస్ జగన్ ను గెలిపించే వ్యూహకర్త ఎవరో..?
ప్రధానాంశాలు:
జగన్ .. ఆ వ్యక్తి ని నమ్ముకున్నాడా..?
Ys Jagan : ఈసారి వైఎస్ జగన్ ను గెలిపించే వ్యూహకర్త ఎవరో..?
Ys Jagan : దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికలపై మరోసారి చర్చలు మొదలయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో ఇలా ముందస్తు ఎన్నికలకు ఆసక్తి చూపిన సందర్భాలున్నా, 2019, 2024 లో మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. అయినా ఈ సారి జన గణన షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జమిలి ఎన్నికల ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్డీయే భాగస్వాముల్లో అంతగా ఆసక్తి కన్పించకపోయినా, ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలపై సీరియస్ గా ఆలోచిస్తున్నాయి.

Ys Jagan : ఈసారి వైఎస్ జగన్ ను గెలిపించే వ్యూహకర్త ఎవరో..?
Ys Jagan : జగన్ కొత్త వ్యూహకర్త కోసం ట్రై చేస్తున్నాడా..?
జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో తీవ్ర పరాజయం ఎదుర్కొంది. గతంలో విజయం సాధించేందుకు ఐప్యాక్ సహకారం తీసుకున్న వైసీపీ, ఈసారి అదే టీం (రిషి రాజ్ సింగ్ ఆధ్వర్యంలో) పనితీరు ఆశించిన స్థాయిలో లేదని భావిస్తోంది. అందుకే ఇప్పుడు కొత్త వ్యూహకర్త కోసం వెతుకులాట సాగుతోంది. అందులో తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న సునీల్ కనుగోలు పేరు ప్రస్తావనలోకి రావడం విశేషం. లేదా ఐప్యాక్ టీం నుంచే బయటకు వచ్చిన యువ మహిళా వ్యూహకర్తను తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
వైసీపీ భావిస్తున్నట్టుగా జమిలి ఎన్నికలు జరిగితే తద్వారా 2028కి వచ్చే ఎన్నికలు ఒకటే సారి జరిగితే – అప్పటికి అధికార వ్యతిరేకత ఎక్కువగా పెరగకముందే తిరిగి పునరాగమనం సాధించాలన్నది జగన్ లక్ష్యం. దానికి అనుగుణంగా ఇప్పుడు నుంచే సుదీర్ఘ వ్యూహాల రూపకల్పన జరుగుతోంది. టీడీపీ కూటమిపై ప్రజల్లో అసంతృప్తిని ప్రధానంగా మలచుకుని, కొత్త స్ట్రాటజీతో ప్రచారం మోతెత్తించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ త్వరలోనే కొత్త వ్యూహకర్తను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.