YS Jagan : తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపిల యొక్క పొత్తు ఆంధ్ర ప్రదేశ్ 2024 ఎన్నికలలో 2014ను రిపీట్ చేసే అవకాశం ఉందేమో అనే ఆలోచన కూడా రానివ్వకుండా ఉండేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే చిన్న పామునైన సరే పెద్ద కర్రతో కొట్టమని చెప్పారు పెద్దలు. ఇక అలాంటి మెంటల్ టీ తో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బిజెపితో టిడిపి పొత్తు కలవడాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్లు తెలుస్తోంది. అయితే వైసిపి నేతలు అధికారులు మాత్రం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి నిధులు నియామకాల గురించి మాట్లాడటానికి జగన్ ఢిల్లీ వెళ్ళినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఢిల్లీ వెళ్తే ఇలానే చెబుతారు. కానీ నిజానికి వారు వెళ్లడానికి వెనుక వారి పర్సనల్ వ్యవహారాలు ఉండవచ్చు, లేదా రాజకీయ వ్యవహారాలు ఉండవచ్చు అని చెప్పాలి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు కూడా మాట్లాడవచ్చు. అయితే ప్రస్తుతం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు అనేదానికంటే ఢిల్లీ వెళ్లిన తర్వాత బిజెపి టిడిపి మరియు జనసేనతో పొత్తును క్యాన్సిల్ చేసేందుకు జగన్ ఎలాంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక విషయానికొస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కలిసి పోటీ చేస్తే 2014లో జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలరు అనే మాట గట్టిగానే వినిపిస్తుంది . ఒక పక్క పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి సామాజిక వర్గ ఓట్లు గత ఎన్నికల్లో జగన్ వైపు పడడం అలాగే బీసీ ఓట్లు కూడా జగన్ వైపు పడడంతో జగన్ అధికారంలోకి వచ్చాడు.
అయితే ఈసారి మాత్రం బీసీ ఓట్లను టిడిపి పార్టీ వెనక్కి తీసుకోగలుగుతుందని, ఇక జనసేన సామాజిక వర్గం ఓట్లు జనసేనకు కచ్చితంగా తిరిగి వస్తాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ కూడా వీరితో జతకడితే ఇక ఈ ముగ్గురు కలిసి ఎలక్షన్స్ కు వారం రోజులు ముందు భారీ సభలను ఏర్పాటు చేసినట్లయితే కచ్చితంగా ఆ ఇంపాక్ట్ జగన్ ప్రభుత్వం పై పడుతుంది అని చెప్పాలి.ఇక నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి నేరుగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి జగన్ అవినీతి చేశాడు అని వ్యాఖ్యలు చేస్తే జగన్ లు అది చాలా పెద్ద తలకాయ నొప్పి అవుతుందని చెప్పాలి. అయితే నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడతాడు అనుకుంటున్నారేమో …కానీ కచ్చితంగా మాట్లాడతాడు అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం అమిత్ షా మీడియాతో అన్న మాట ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి ఉంది అని. ఇక ఈ మాటలను వారు చాలా ఓపెన్ గా చెప్పేశారు. అయితే ప్రజలను మోసం చేస్తూ రాజకీయాలు చేసే ఇలాంటి నాయకులు అందరూ కూడా ఎవరిని వారు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన వద్ద ఉన్న హస్త్రాన్ని బయటకు తీసి చంద్రబాబును దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఆ బ్రహ్మాస్త్రం ఏంటి అనే విషయానికొస్తే. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో 11 కొత్త బిల్స్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కచ్చితంగా ఎంపీల సపోర్టు కావాల్సి ఉంటుంది. అయితే గత 4 సంవత్సరాల నుంచి చూసినట్లయితే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడని ఒకే ఒక్క కారణంతో పార్లమెంట్ లో ఎలాంటి వివాదం చేయకుండా ఎలాంటి క్వశ్చన్ చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ మోడీకి మద్దతు తెలుపుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఎంపీలందరూ పార్లమెంట్ లో మీ 11 బిల్స్ కు సపోర్ట్ ఇవ్వాల్సింది మేము కదా.. మీరు వారితో పొతే ఎలా పెట్టుకుంటారని జగన్ ప్రశ్నించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మీరు టిడిపి జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లయితే మా పార్లమెంట్ ఎంపీలు 26 మంది లో ఎవరూ కూడా మీ 11 బిల్స్ కు మద్దతు గా ఉండరు అనే విషయాన్ని జగన్ మోడీతో స్పష్టంగా చెప్పనున్నట్లు తెలుస్తోంది. అసలు వారిని రాకుండా చేస్తే చాలు మీ బిల్స్ కు ఇబ్బంది కలుగుతుంది. ఇక దేశంలో ముఖ్యమైన బిల్స్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ వచ్చే బిల్స్ కనుక వాళ్ళు రాకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారనే సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి మోడీకి ఇవ్వడం ద్వారా తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి నరేంద్ర మోడీ తలవంచితే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో టిడిపి తో బీజేపీ పొత్తు కుదరదని చెప్పాలి. లేదా పార్లమెంటు ఎన్నికలు ముగిసేంతవరకు లేదా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ముగిసే వరకు ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది చంద్రబాబుకు పెద్ద దెబ్బ అని చెప్పాలి.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.