Telangana Budget 2024 : ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఇది కాంగ్రెస్ కు తొలి బడ్జెట్ కావడం విశేషం. ఆరు గ్యారంటీలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉంటాయని అందరూ ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పై ఈనెల 12న చర్చ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం.
లోక్ సభ ఎన్నికలు వస్తున్నవేళ తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది ప్రజలకు మేలు చేకూరేలా ఉంటుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ఈ బడ్జెట్ లో కనిపిస్తుందని అంటున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి. నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మొత్తం బడ్జెట్ – 2,75,891 కోట్లు..
ఆరు గ్యారంటీల కోసం రూ. 53,196 కోట్లు అంచనా
రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ. 28,024 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు
విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ. 7,740 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు
మూసీ నది అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు కేటాయింపు..
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు కేటాయింపు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 40,080 కోట్లు
ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 1000 కోట్లు
ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.