YS Jagan : చంద్రబాబు ఇల్లు కాపాడేందుకే విజయవాడని ముంచేశారా..జగన్ స్టన్నింగ్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
YS Jagan : చంద్రబాబు ఇల్లు కాపాడేందుకే విజయవాడని ముంచేశారా..జగన్ స్టన్నింగ్ కామెంట్స్..!
YS Jagan : ప్రస్తుతం ఏపీలో వరద బాధితులు అనేక కష్టాలని చవిచూస్తున్నారు.ఊహించని వరద రావడంతో ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారింది. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నివాసముంటున్న ప్రాంతం కూడా నీళ్లలో మునిగినందును అక్కడ ఉండలేని స్థితిలో కలెక్టరేట్‌లో ఉండి బాధితులకు సహాయం చేస్తున్నట్లు బిల్డప్‌లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
YS Jagan చంద్రబాబే కారణం..
వర్షాలు, వరదల సమాచారం ఉన్నాకూడా చంద్రబాబు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎక్కడా రిలీఫ్ కేంద్రాలు కనిపించడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో గోదావరికి వరదలోస్తే పెద్ద ఎత్తున్న ఆదుకున్నామని అన్నారు.ముందస్తు చర్యలు తీసుకుని నష్టం జరుగకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటే , కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే విజయవాడ విపత్తుకు గురి అయ్యేది కాదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా అట్టర్‌ఫ్లాప్ అని అన్నారు. వరదల్లో చనిపోయిన వారికి రూ. 25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఇంటికి రూ. 50 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పాలనలో వైఫల్యం కారణంగానే విజయవాడ ను వరదలు ముంచెత్తాయన్నారు. చంద్రబాబు నిర్లక్ష్య ధోరణి వల్లే నేడు 32 మంది మరణించారని చెప్పారు. చంద్రబాబుకు తన ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో కలెక్టరేట్ లో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ప్రజల కోసం కలెక్టరేట్లో ఉంటున్నట్లు బిల్డప్ లు ఇస్తున్నారని మండిపడ్డారు. అయితే ఒకవైపు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు టీడీపీ నాయకులు.