Pawan Kalyan : వైసీపీని గద్దె దించడం కాదు.. తన వేలితో తన కంట్లోనే పొడుచుకుంటున్న పవన్ కళ్యాణ్

Advertisement

Pawan Kalyan : ఏపీలో జనసేనకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. వైసీపీపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారాహి యాత్రలోనూ ఆయన చేసే వ్యాఖ్యలు అలాగే ఉంటున్నాయి. దీంతో అందరూ జనసేన అసలు ప్రత్యర్థి వైసీపీనే అని అనుకుంటున్నారు. కానీ.. అసలు వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో సాగుతోంది. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గంలో సాగుతోంది.

Advertisement

వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యం అంటూ గాజువాకలో బద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్. కేవలం జగన్ ను అధికారంలో లేకుండా చేస్తే… ఆయన్ను గద్దె దించితే నీకు వచ్చే లాభం ఏంటి. నువ్వు గెలుస్తావా? నువ్వు సీఎం అవుతావా అంటూ విమర్శలు వస్తున్నాయి. కేవలం వైసీపీనే చూస్తున్న పవన్ కళ్యాణ్.. మరోపార్టీ టీడీపీ గురించి ఎందుకు ఆలోచించడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం వైసీపీ మీదనే టార్గెట్ చూస్తే ఎక్కడ మాట్లాడినా జగన్ గురించే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా జగన్ కు మైలేజీ వచ్చేలా వ్యవహరిస్తున్నారు అనే సందేహాలు వస్తున్నాయి.కేవలం జగన్ ను టార్గెట్ చేస్తే చాలా? ఏపీలో నువ్వు గెలిస్తే ఏం చేస్తావు ఆ విషయం చెప్పవా? నువ్వు ఇచ్చే హామీలు ఏంటి.

Advertisement
Pawan Kalyan
Pawan Kalyan

 Pawan Kalyan : కేవలం జగన్ ను టార్గెట్ చేస్తే ఓట్లు రాలుతాయా పవన్ భయ్యా?

అవన్నీ చెప్పకుండా కేవలం జగన్ ను టార్గెట్ చేస్తే ఓట్లు రాలుతాయా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో వారాహి యాత్ర పేరుతో జగన్ ను మాత్రమే తిడుతూ యాత్ర కొనసాగిస్తే దాని వల్ల పవన్ కు వచ్చే లాభం అయితే శూన్యం. అది జగన్ కు సింపతీని తీసుకొస్తుంది. ఇన్ డైరెక్ట్ గా పవన్ వారాహి యాత్ర పేరుతో చేసే యాత్ర అది జగన్ కే మేలు చేస్తుంది కానీ.. పవన్ కళ్యాన్ కు కాదు.. చంద్రబాబుకు కాదు అని అంటున్నారు. చూద్దాం మరి ఎన్నికల వరకు ఏం జరుగుతుందో?

Advertisement
Advertisement