Ys Sharmila : కాంగ్రెస్ పెద్దల చొరవతో జగన్,షర్మిళ కలవబోతున్నారా.. ఒప్పందం ఏంటంటే..!
Ys Sharmila : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల మధ్య దూరం క్రమేపీ పెరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కనపెట్టి అన్నా చెల్లెళ్ళు కలవలేదు. షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు.ఇది అందరిని ఆశ్చర్యపరచింది. గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెలు ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ ను ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఇది కాస్త పని చేసిందని కొందరు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తన పరాజయం పై ప్రభావం చూపిన అంశాల పై ఫోకస్ చేసారు. పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారు.
షర్మిల పరంగా జరిగిన నష్టం గుర్తించారు. ఫలితంగా జగన్ – షర్మిల మధ్య రాజీ చర్చలకు ఇద్దరు పెద్దలు చొరవ తీసుకున్నారు. ఎట్టకేలకు రాజీకి వచ్చారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకునే నిర్ణయం ఏపీలో ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యే వరకూ షర్మిల తన అన్న ఓటమే లక్ష్యంగా పని చేసారు. కూటమి కంటే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇక.. జగన్ తన ఓటమికి కారణాల విశ్లేషణ..దిద్దుబాటులో భాగంగా పార్టీతో పాటుగా కుటుంబంలోనూ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కసరత్తు ప్రారంభించారు. రాజకీయంగా..కుటుంబ పరంగా జగన్ – షర్మిలతో దగ్గరగా ఉండే ఇద్దరు “పెద్దలు” రంగంలోకి దిగారు. బెంగళూరు కేంద్రంగా కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఎన్నికల ఫలితాల తరువాత వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ.. మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్నారు.
Ys Sharmila : కాంగ్రెస్ పెద్దల చొరవతో జగన్,షర్మిళ కలవబోతున్నారా.. ఒప్పందం ఏంటంటే..!
అక్కడే అన్నా – చెల్లి మధ్య చర్చలు పలు విడతలుగా జరిగినట్టు సమాచారం.. ముందుగా జగన్ – షర్మిల మధ్య ఆర్దిక పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చర్చల సమయంలో షర్మిల కోరిన విధంగా ఆస్తిలో వాటాలు పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు అంశాల్లో మినహా ఆస్తుల అంశాల్లో ఇద్దరి మధ్య దాదాపు రాజీ పూర్తయిందని సమాచారం. జమిలి ఎన్నికల ప్రచారం వేళ..పార్టీలో దిద్దుబాటు చర్యలతో పాటుగా.. తనను డామేజ్ చేసిన అంశాలను సరి దిద్దుకోవాలని..ఆ తరువాతనే ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే.. ఇప్పుడు జగన్ – షర్మిల తాజా రాజీతో ఏపీ రాజకీయం ఎలా మారుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.