YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వై.ఎస్.షర్మిల బాధ్యతలు చేపట్టారు. కానూరు లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందని, రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలు అయిన వచ్చాయా అని ప్రశ్నించారు. అప్పుల పైన నిలదీశారు. హోదా ఏమైంది జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ ఆశయ సాధన కోసం తాను సిద్ధమని తనతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
టీడీపీ, వైసీపీ పదేళ్ల పాలన గురించి వై.యస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో ఇద్దరి హయాంలో రాష్ట్రానికి అప్పు 10 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. రాష్ట్రంలో ఒక్క మెట్రో లేదని, చెప్పుకునే స్థాయిలో ఏ డెవలప్మెంట్ లేదని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇస్తున్నారా అని నిలదీశారు. దళితుల పైన మాత్రం దాడులు 100% పెరిగాయి అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్, ఇసుక మాఫియా ఉందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో చంద్రబాబు 15 ఏళ్లు స్టేటస్ కావాలని కోరారని అంశాన్ని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండి జగన్ రెడ్డి హోదా కోసం దీక్షలు చేశారన్నారు. స్వలాభం కూడా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను టీడీపీ, వైసీపీ తాకట్టు పెట్టాయని విమర్శించారు.
హోదా లేదంటే ఆ పాపం చంద్రబాబు జగన్ దేనిని షర్మిల అన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించారని ఆరోపించారు. జగన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు. ఒక్కటి లేదని ఎద్దేవా చేశారు. మరి ఏం సాధించారని నిలదీశారు. పోలవరంలో చంద్రబాబు జగన్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు బీజేపీకి ఎందుకు పొత్తులుగా మారారని నిలదీశారు. రెండు పార్టీలు బీజేపీ ఏం చెబితే దానికి గంగిరెద్దుల మారారని వ్యాఖ్యానించారు. ఒక్క అంశంలో అయిన టీడీపీ, వైసీపీ బీజేపీని వ్యతిరేకిచ్చిందా అని ప్రశ్నించారు. మణిపూర్ లో క్రైస్తవులపై, వివక్ష చర్చిలు కూల్చారని మండిపడ్డారు. బీజేపీతో వైసీపీ టీడీపీ పొత్తులు ఉన్నాయని ఆరోపించారు. వైయస్సార్ ఊపిరి ఆశలు కాంగ్రెస్ తోనేనని స్పష్టం చేశారు. వైయస్సార్ అభిమానులు చేతులు కలపాలని, వైయస్సార్ ఆశయాలను సాధించేందుకు తాను రెడీగా ఉన్నానని, మీరు రెడీనా అంటూ కార్యకర్తలకు షర్మిల పిలుపునిచ్చారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.