YS sharmila : పదవి కోసం నాన్న, బాబాయ్ ని చంపేశాడు… ఇప్పుడు మా అమ్మని… వైయస్ షర్మిల..!
ప్రధానాంశాలు:
YS sharmila : పదవి కోసం నాన్న, బాబాయ్ ని చంపేశాడు... ఇప్పుడు మా అమ్మని... వైయస్ షర్మిల..!
YS sharmila : ఆంధ్రప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల తన అన్న జగన్ పై విస్తృతస్థాయిలో విమర్శలు చేస్తూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు అనేక రకాలుగా జగన్ పై విమర్శలు చేసిన షర్మిల తాజాగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైయస్ షర్మిల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న లిక్కర్ దందాపై నోరు విప్పారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న మందు సీసాల పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కాపిటల్ అటా , స్పెషల్ స్టేటస్ అట, బీఎస్సీ అట, వీళ్ళు ఏ మందు అమ్మితే అదే తాగాలట.
వీళ్ళు అమ్మే నాసిరకం మందు తాగడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 శాతం మంది చనిపోతున్నారని ఈ సందర్భంగా షర్మిల తెలిపారు. ఈ నాసిరకమైన మందు తాగడం వలన కిడ్నీలు లివర్ చెడిపోయి ఎంతోమంది ఆసుపత్రి పాలవుతున్నారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ చెకప్ కూడా లేదు. ఉన్నచోట కూడా క్యాష్ ఉంటేనే తీసుకుంటున్నారట కదా. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ తీసుకోవడం లేదట. అంటే ఎంత టాక్స్ కడుతున్నారు ఏంటి అనేది కూడా తెలియకుండా దాచేస్తున్నారు. ఒక పాడు పద్ధతి లేకుండా ఇష్టానుసారం జగన్ వ్యవహరిస్తున్నారని మన రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. ఒకపక్క లిక్కర్ మాఫియా, మరో పక్క డ్రగ్స్, మరోపక్క ఇసుక మాఫియా, మరో పక్క ల్యాండ్ మాఫియా ఇదంతా సరిపోదు అన్నట్లు సొంత బాబాయ్ ని హత్య చేసిన వారిని కాపాడుకుంటూ వస్తున్నారు. తిరిగి మళ్లీ వారికే ఎంపీ టికెట్లను కూడా ఇస్తున్నాడు.
ఇటీవల జగన్ మోహన్ రెడ్డి గారు పులివెందుల వెళ్లారు. పులివెందులలో ఒక సభ కూడా పెట్టారు. ఆ సభలో మా బాబాయి వివేకానంద రెడ్డి గారి ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ ప్రస్థావనలో వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా తన మనసులో నుంచి రాలేదు. ఆయన చెప్పిన మాట వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్లి అయిందట మరో సంతానం ఉందట. అంతేతప్ప వివేకానంద్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడని , చాలా ఏళ్లు ప్రజలను ఆదుకున్నాడని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు అని అంతేకాదు ఆఖరి నిమిషం వరకు వైసీపీ పార్టీ కోసం పోరాడినవాడని చెప్పింది లేదు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి జగన్ ఒక్క మంచి మాట కూడా మాట్లాడాలేకపోయాడు.
YS sharmila : అవినాష్ రెడ్డి భవిష్యత్తును మేము దెబ్బతీస్తున్నామా…
అలాగే అవినాష్ రెడ్డి భవిష్యత్తును మేము పాడు చేస్తున్నామట. నిజంగా మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసి ఉంటే గతంలో ఎంపీగా అవినాష్ రెడ్డి ని నిలబెట్టినప్పుడు మేము ఎవరు కాదనలేదు కదా అంటూ షర్మిల ప్రశ్నించారు. అలాగే వివేకానంద రెడ్డి చనిపోయిన వెంటనే దీనికి కారణం అవినాష్ రెడ్డి అని మేము చెప్పలేదే. మాకేం అవసరం అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేయటం. అలాగే జగనన్న అవినాష్ రెడ్డి ని గుడ్డిగా నమ్ముతున్నాడని, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడని సీబీఐ అన్ని రకాలుగా ఆధారాలు చూపిస్తున్నప్పటికీ జగనన్న ఎందుకు అవినాష్ రెడ్డిని గుడ్డిగా నమ్ముతున్నావు. నీకు దేవుడు జ్ఞానం ఇవ్వలేదా అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.