YS Sharmila : షర్మిల పాదయాత్ర వెనుక పెద్ద కుట్ర ఉంది… సంచలన విషయాలు బయటపెట్టిన వైఎస్ షర్మిల అనుచరుడు…!
YS Sharmila : ఆంధ్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇప్పుడు దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించేందుకు బరిలో దిగిన షర్మిల కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఉద్ధరిస్తుందో తెలియదు కానీ…ఈ ముసుగులో వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం బాగా చేస్తుంది.అదేవిధంగా జగన్ పార్టీ విజయాలను దెబ్బ కొట్టాలనే ఆలోచన షర్మిలకు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మొదట తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి అక్కడ రాజకీయాలు చేస్తానంటూ హడావిడి చేసి […]
ప్రధానాంశాలు:
YS Sharmila : షర్మిల పాదయాత్ర వెనుక పెద్ద కుట్ర ఉంది... సంచలన విషయాలు బయటపెట్టిన వైఎస్ షర్మిల అనుచరుడు...!
YS Sharmila : ఆంధ్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇప్పుడు దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించేందుకు బరిలో దిగిన షర్మిల కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఉద్ధరిస్తుందో తెలియదు కానీ…ఈ ముసుగులో వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం బాగా చేస్తుంది.అదేవిధంగా జగన్ పార్టీ విజయాలను దెబ్బ కొట్టాలనే ఆలోచన షర్మిలకు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మొదట తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి అక్కడ రాజకీయాలు చేస్తానంటూ హడావిడి చేసి అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ లీక్ విలీనం చేసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు పుచ్చుకున్న షర్మిల వెనుక చంద్రబాబు కుట్ర కోణం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీన నిర్ణయం తీసుకునే వరకు ఆమెకు కీలక అనుచరుడుగా నిలిచిన నాయకుడు కొండ రాఘవరెడ్డి ఆమె గురించి కొన్ని విషయాలను బయటపెడుతున్నారు. ఇక జగనన్న జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం షర్మిల పాదయాత్ర చేసిన సమయంలోనే ఆమెలో ఎంతో కుట్ర కోణం దాగి ఉందని ఆయన తెలియజేశారు. అయితే కొండ రాఘవరెడ్డి అంటే వైయస్సార్ తెలంగాణ పార్టీ పుట్టినప్పటి నుండి షర్మిలకు అండగా ఉన్న కీలక నాయకుడు. అంతేకాదు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన అత్యంత విశ్వనీయమైన వ్యక్తులలో ఒకరు.
ఈ క్రమంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన ఆమె వెనుక నిలబడ్డారు. పార్టీ నిర్మాణంలో సహకరించారు. అలాగే షర్మిల పాదయాత్రలకు సూత్రధారిగా ఆయన వెనుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను పొందాలనే ఆలోచన షర్మిలకు వచ్చినప్పటినుండి రాఘవరెడ్డి షర్మిలను విభేదించి బయటకు వెళ్లారని చెప్పాలి. అయితే అసలు కొండా రాఘవరెడ్డి ఏనాడు వైతేపా కార్యకర్త కాదని షర్మిల ఆయన గురించి చాలా చులకనగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.దీంతో ప్రస్తుతం ఆయన తెరమీదకు వచ్చి…షర్మిల లో ఉన్న కుట్ర కోణం ఇప్పటిది కాదనే సంగతి బయటపెట్టారు. ఇక కొండ రాఘవరెడ్డి చెబుతున్న ప్రకారం…వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడే వైయస్సార్ పార్టీని కాపాడుకోవడానికి ప్రజలతో మమేకం అవ్వడానికి ముందుగా తల్లి విజయమ్మతోనే పాదయాత్ర చేయాలని అనుకున్నారట. కానీ విజయమ్మకు మోకాళ్ల నొప్పులు అన చెప్పి ఆమె పాదయాత్రను చేయకుండా షర్మిల అడ్డుకున్నారట. ఇక ఆ తర్వాత జగన్ భార్య భారతి దేవితో పాదయాత్ర చేయాలని అనుకుంటే దానిని కూడా షర్మిల అడ్డుకున్నారట.
అంతేకాక అన్న కోసం తాను పాదయాత్ర చేస్తానంటూ స్వయంగా ముందుకు వచ్చిందని…అయితే షర్మిల అప్పుడే మనసులో విష బీజాలు, స్వార్థపూరిత ఆలోచనలు పెట్టుకొని , వ్యూహాత్మకంగానే పాదయాత్ర చేసిందని కొండా రాఘవరెడ్డి అంటున్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రి కాగానే షర్మిల భర్త అనిల్ తో కలిసి ప్రభుత్వాధినేతగా తమకు ఒక పని చేసి పెట్టాలని అడిగారట. ఇక అది రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేది కావడంతో జగన్ దానికి ఒప్పుకోకపోవడం..దీంతో షర్మిల మరియు అనిల్ జగన్ పై పగబట్టారని కొండ రాఘవరెడ్డి తెలియజేస్తున్నారు. ఆమె విషం చిమ్ముతూ ముందుకు నడుస్తుంటే ఆమె వెనుక నుంచి కొన్ని దుష్టశక్తులు నడిపిస్తున్నాయని ఆయన తెలియజేశారు. ఇక షర్మిల విషం చిమ్ముతున్న సంగతి అందరికీ కనిపిస్తుందని , ఇక కనిపించని ఆ దుష్టశక్తులను ప్రజలు సులభంగానే కనుగొంటారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొండ రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చానియాంశంగా మారాయి.