YS Jagan : ఏంటి జగన్ బెంగుళూరు వెళ్లడానికి షర్మిల కారణమా.. ఇంత పెద్ద స్టోరీ ఉందా..?
YS Jagan : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ పేరు ఓడిపోయినా సరే వినిపిస్తూనే ఉంది. ప్రతి పక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ గురించి ప్రతిరోజు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఏపీలో జరిగిన రీసెంట్ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఓడిన జగన్ ఎక్కువగా బెంగుళూరు వెళ్లి ఉంటున్నాడు. ఐతే 2009 జగన్ రాజకీయాళ్లోకి రాకముందు బెంగుళూరులోనే నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉండేవాడు. భార్యా పిల్లలతో […]
YS Jagan : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ పేరు ఓడిపోయినా సరే వినిపిస్తూనే ఉంది. ప్రతి పక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ గురించి ప్రతిరోజు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఏపీలో జరిగిన రీసెంట్ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్ గెలిచి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఓడిన జగన్ ఎక్కువగా బెంగుళూరు వెళ్లి ఉంటున్నాడు. ఐతే 2009 జగన్ రాజకీయాళ్లోకి రాకముందు బెంగుళూరులోనే నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉండేవాడు. భార్యా పిల్లలతో కలిసి బెంగుళూరులోనే వైఎస్ జగన్ ఉండేవాడు. ఐతే 2009 లో కడప ఎంపీగా పోటీ చేసి గెలిచిన జగన్ వైఎస్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. దాదాపు 2019 ఎన్నికల వరకు హైదరాబాద్ లోనే ఉన్నాడు జగన్. 2019 లో జగన్ గెలిచాక తాడేపల్లిలో నివాసం ఏర్పరచుకున్నాడు. గెలిచిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకు జగన్ తాడేపల్లి నివాసం లోనే ఉన్నాడు. ఎన్నికల్లో ఓడిన జగన్ మళ్లీ ఇప్పుడు ఫ్యామిలీని బెంగుళూరు నివాసానికి షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది.
YS Jagan షర్మిలతో కలిసి ఉండలేకనే..
ఐతే జగన్ తాడేపల్లి నుంచి హైదరాబాద్ లోటస్ పాండ్ కి వెళ్లొచ్చు కానీ అక్కడ వైఎస్ షర్మిల ఉంటున్నారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోనే తన ఫ్యామిలీతో ఉంటున్నారు. జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ కి వెళ్లాలని అనుకున్నా అక్కడ షర్మిల ఉంది కాబట్టి ఆమెతో కలిసి ఉండటం ఇష్టం లేకనే జగన్ బెంగుళూరు నివాసానికి వెళ్లారని తెలుస్తుంది.
ఐతే హైదారాబాద్ లోటస్ పాండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టించాడు. అందులో షర్మిలకు కూడా సమాన హక్కు ఉంటుంది. అందుకే జగన్ తాడేపల్లిలో ఉంటే షర్మిల లోటస్ పాండ్ లో ఉంది. తాడేపల్లి ఖాళీ చేసి జగన్ బెంగుళూరుకి షిఫ్ట్ అయ్యారు. తాడేపల్లి ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న జగన్ అక్కడ నుంచే రాజాకీయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అందుకే బెంగుళూరు నుంచి తాడేపల్లి వచ్చి వెళ్తున్నారని తెలుస్తుంది.