YS Sharmila : గత కొద్ది రోజులుగా జగన్,షర్మిళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న రాజీ చర్చలు ఫలించాయని, షర్మిల పరంగా జరిగిన నష్టం గుర్తించిన జగన్ చివరికి రాజీకి వచ్చినట్టు టాక్ నడడిచింది. ఇదంతా విని వైసీపీ క్యాడర్ ఫుల్ సంతోషిస్తున్న సమయంలో షర్మిళ పెద్ద బాంబ్ పేల్చింది. రాజీ వార్తలు బయటకు వచ్చి గంటలు గడవకముందే పీసీసీ చీఫ్ హోదాలో జగన్ మీద షర్మిల పేల్చిన డైలాగులతో మొత్తం వ్యవహారం మారింది అని అంటున్నారు. కుదిరింది వ్యక్తిగతంగా ఉన్న ఆస్తులకు సంబంధించిన వివాదమే కావచ్చు కానీ రాజకీయంగా జగన్ తో విభేదించేందుకే షర్మిల రెడి అయిందనే టాక్ వినిపిస్తుంది.
వైసీపీ కోసం షర్మిళ ఎంతో చేశారు. కానీ ఒక ఎంపీ సీటుని కూడా పొందలేకపోయారు .జగన్ జైలులో ఉన్నపుడు పార్టీని మొత్తంగా నిలబెట్టింది వేల కిలోమీటర్ల షర్మిల పాదయాత్ర అని ఇప్పటికీ అంతా చెబుతారు. కారణాలు ఏమైనా కూడా ఆమెకు రాజకీయంగా అందలం అయితే దక్కలేదు. ఆమె రాజ్యసభను కోరుకున్నారు అని దానికి కూడా చాన్స్ ఇవ్వలేదని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే తాజాగా షర్మిళ జగన్‌పై నిప్పులు చెరగడం చర్చనీయాంశం అయింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అని ఎక్స్ వేదికగా సోమవారం ఆమె స్పష్టం చేశారు. నాడు వైఎ్‌సఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అద్భుతంగా అమలు చేశారని, ఆయన సొంత కొడుకై ఉండి జగన్ తన హయాంలో ఈ పథకాన్ని నీరుగార్చారని అసహనం వ్యక్తం చేశారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే అన్న చెల్లెళ్ల మద్య విబేధాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.