YS Sharmila : లిక్కర్ కేసులో జగన్ కు ఉచ్చుపడేలా వ్యాఖ్యలు చేసిన షర్మిల.. వీడియో !
ప్రధానాంశాలు:
YS Sharmila : లిక్కర్ కేసులో జగన్ కు ఉచ్చుపడేలా వ్యాఖ్యలు చేసిన షర్మిల
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో లిక్కర్ స్కాం పై Liquor scam సిట్ విచారణను ఎండగడుతూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. డిస్టిలరీల చుట్టూ తిరిగే విచారణ మాత్రమే జరుగుతోందని, అసలు అవినీతిపై సరైన దర్యాప్తు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లావాదేవీలన్నీ కేవలం క్యాష్‌లో జరగడం, దానికి పన్నులు చెల్లించకపోవడమే అసలు కుంభకోణమని ఆరోపించారు. నెలకు 50-60 కోట్ల రూపాయల ముడుపులు పంపిణీ అయినట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ స్కాం కేవలం రూ. 3,500 కోట్లకే పరిమితం కాదని, మద్యం ఉత్పత్తి స్థాయిల నుంచి వినియోగదారుల వరకు ఉన్న వ్యవస్థ మొత్తం అవినీతితో నిండి ఉందన్నారు.

YS Sharmila : లిక్కర్ కేసులో జగన్ కు ఉచ్చుపడేలా వ్యాఖ్యలు చేసిన షర్మిల..!
YS Sharmila : లిక్కర్ కేసులో అసలైన దొంగలను సిట్ అరెస్ట్ చేయడం లేదు – షర్మిల
డిజిటల్ యుగంలో ఉన్నప్పటికీ ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం అమ్మడం ప్రపంచంలో ఏకైక ఉదాహరణగా నిలిచిందని షర్మిల అన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను పెద్ద ఎత్తున అమ్మి ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ఆరోపణల ప్రకారం రూ. 1 లక్ష కోట్ల లిక్కర్ అమ్మకాలలో కేవలం రూ. 600 కోట్ల డిజిటల్ పేమెంట్స్ మాత్రమే జరిగాయని, మిగిలిన రూ. 99 వేల కోట్లకు ఎటూ సమాచారం లేదని షర్మిల గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, జగన్ బాధ్యతను తప్పించుకోలేడని అన్నారు.
లిక్కర్ వల్ల రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడిందని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ సమస్యలు వచ్చాయని, 30 వేల మంది మద్యం వల్ల మరణించారని కూటమి ప్రభుత్వ నివేదికలో వెల్లడయిందన్నారు. జగన్ ప్రభుత్వం ట్రస్టెడ్ కంపెనీల మద్యం విక్రయించకుండా, హానికరమైన మద్యం అమ్మకాలకు అనుమతులిచ్చిందని ఆరోపించారు. రుషికొండ భూ వ్యవహారం, వివేకా హత్య వంటి అంశాల్లో కూడా జగన్ సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ అరెస్ట్ అవుతారో లేదో చూడాలని, విచారణ ఆధారంగా తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
