Ys Sharmila : కడపలో షర్మిల చీల్చేది టీడీపీ ఓట్లే.. చంద్రబాబుకు టెన్షన్..!
ప్రధానాంశాలు:
Ys Sharmila : కడపలో షర్మిల చీల్చేది టీడీపీ ఓట్లే.. చంద్రబాబుకు టెన్షన్..!
Ys Sharmila : కడప రాజకీయాలు ఎప్పుడూ వైఎస్ ఫ్యామిలీ నిర్ణయాలనే మీదనే ఆధారపడి ఉంటాయి. కడప అంటేనేవైఎస్.. వైఎస్ అంటేనే కడప అన్నట్టు ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డిఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత వైసీపీ పార్టీదే హవా. ఇక మరీ ముఖ్యంగా కడప ఎంపీ సీటు అయితే టీడీపీ గెలిచి కొన్ని దశాబ్దాలు అవుతోంది. ఇలాంటి సమయంలో ఇప్పడు కడప ఎంపీ సీటుపై అందరి దృష్టి పడింది. ఎందుకంటే కడప ఎంపీసీటులో అటు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాశ్ రెడ్డి, ఇటు వైఎస్ కూతురు షర్మిల పోటీ పడుతున్నారు.దాంతో అందరి చూపు కడప ఎంపీ సీటుపై పడింది. అయితే ఇక్కడి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారా అనిఇన్ని రోజులు టెన్షన్ ఉండేది.
Ys Sharmila : జగన్ పై షర్మిల విమర్శలు..
కానీ ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు ఆశించిన ఆ నియోజకవర్గం ఇన్ చార్జి భూపేశ్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ ఆయనకు ఎంపీగా పోటీ చేయడం అస్సలు ఇష్టంలేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల పోటీ చేసి వైసీపీ ఓట్లను చీల్చకుండా.. టీడీపీ ఓట్లను చీలుస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే షర్మిల పదే పదే జగన్ ను విమర్శిస్తోంది.కానీ చంద్రబాబుపై పెద్దగా విమర్శలు చేయట్లేదు. అటు ఎల్లో మీడియా కూడా షర్మిలకే అనుకూలంగా వార్తలు రాస్తోంది. దాంతో పాటు బీటెక్ రవి లాంటి టీడీపీ నేతలు ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
ఇవన్నీ వెరసి.. వైసీపీ అభిమానులు, వైఎస్సార్ అభిమానులు ఇప్పుడు తమ నాయకుడిగా జగన్ ను చూస్తున్నారు. వైఎస్ వారసుడు అంటేజగనే అని.. తామంతా వైసీపీకే గంపగుత్తగా ఓట్లేస్తామని డిసైడ్ అయిపోతున్నారు. అటు కడపలో ఎలాగైనా వైసీపీని ఓడించాలని తెలుగు తమ్ముళ్లు పట్టుదలగా ఉన్నారు. కాబట్టి భైపేష్ కు వేసినా గెలుస్తాడో లేదో అనే అనుమానం ఉంది. కాబట్టి వైసీపీని ఓడించడం కోసం వారంతా ఇప్పుడు షర్మిలకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తంగా షర్మిల ఇటు టీడీపీ ఓట్లనే చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు చంద్రబాబు అలెర్ట్ అయిపోయి షర్మిలపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు కడప రాజకీయాలు హైలెట్ గా మారుతున్నాయి.