YS Sharmila : వైయస్ జగన్ కి గుడ్ న్యూస్.. వైయస్ షర్మిల కి షాక్ ఇచ్చిన వైయస్ సునీత ..!

Authored By aruna | The Telugu News | Updated on : 26 January 2024, 9:30 pm
  •  YS Sharmila : వైయస్ జగన్ కి గుడ్ న్యూస్.. వైయస్ షర్మిల కి షాక్ ఇచ్చిన వైయస్ సునీత ..!

YS Sharmila : ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తుంది. అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై గెలవాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమిగా ఏర్పడ్డారు. వైయస్ జగన్ ఎలాగైనా అధికార పీఠం నుంచి దింపాలని టీడీపీ, జనసేన బలంగా కోరుకుంటున్నాయి. అయితే అంతకన్నా ఎక్కువగా వైయస్ జగన్ ఓడిపోవాలని వైయస్ షర్మిల కోరుకుంటున్నారు. వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ మీడియా హైప్ చేస్తుంది. ఆమె మాట్లాడే ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ ప్రతి వీడియోను హైలైట్ చేస్తూ వస్తున్నారు. మరో 70, 80 రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు జనాలపై ప్రభావం చూపిస్తాయి. ఇక వైయస్ షర్మిల వైఎస్ సునీతను తన పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కడప నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు.

తన తండ్రి వివేకానంద రెడ్డిని హత్య చేసిన అంశం పైన గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్ సునీత కు ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా కేవలం చట్టాన్ని నమ్ముకుని ముందుకెళుతున్న వైయస్ సునీత తన తండ్రిని చంపిన వారిని ప్రజలకు తెలియజేయాలని ఆమె చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళుతున్నారు. అయితే వైఎస్ సునీతను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని వైయస్ షర్మిల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైఎస్ సునీత ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రానని వైయస్ షర్మిలకు తేల్చి చెప్పారట. వైఎస్ సునీతతో పాటు తన భర్త రాజశేఖర్ కూడా రాజకీయాలలోకి రామని కరాకండిగా చెప్పారట. కేవలం వివేకానంద హత్య కేసు మీదే దృష్టి సారించామని, రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోకి రామని ఓపెన్ గా వైయస్ షర్మిలకు తెలిపారట.

ఇది వైయస్ జగన్ కు గుడ్ న్యూస్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు జగన్ కి డ్యామేజ్ అంటే తండ్రి చనిపోయాక రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ సునీత కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తే అది జగన్ కు ఎక్కువ డ్యామేజ్ చేసినట్లు అవుతుంది. అయితే వైఎస్ సునీత రాజకీయాలలోకి రానని చెప్పారు. ఇక వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి రాజకీయాలలో సంచలనంగా మారారు. అలాగే ఆమె దూకుడుతనం, తన అన్న పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

aruna

No bio available for this author.

  1. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

  2. "NCC Army Jobs : అమ్మాయిలకు గుడ్ న్యూస్.. NCC ‘C’ సర్టిఫికెట్‌తో నేరుగా ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు"

  3. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  4. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  5. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

  6. "karthika Deepam 2 Today Episode 2026 July 22 : సుమిత్ర ఒక్క ప్రశ్నతో షాక్‌లో సూరజ్.. అసలు నిజం బయటపడబోతోందా?"

  7. "Gold Rate Today : బంగారం కొనేవారికి షాక్.. ఒక్కరోజులో పెరిగిన పసిడి ధరలు.. జూలై 22 రేట్లు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి