YSR Sunna Vaddi Scheme : వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం.. అక్కాచెల్లెళ్లకు ఆర్థిక చేయూత
YSR Sunna Vaddi Scheme : ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలు, మహిళల కోసం, వాళ్ల ఆర్థిక స్వావలంబన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా వచ్చిన వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మహిళలకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఏపీలోకి అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు తీసుకొచ్చిన పథకం ఇది.
ఈ పథకం ప్రకారం ఏపీ వ్యాప్తంగా ఉన్న 9.48 లక్షల సంఘాలకు ఆర్థికంగా ఉపయోగపడుతోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు 1.05 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు. వాళ్లకు ఇప్పటి వరకు వడ్డీ లేకుండా సున్నా వడ్డీ రుణాలు రూ.1353.76 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా చాలామంది సొంతంగా వ్యాపారం పెట్టుకొని తమ కాళ్ల మీద తాము నిలబడుతున్నారు.
YSR Sunna Vaddi Scheme : మమ్మల్ని ఆదుకున్న జగనన్నను ధన్యవాదాలు
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ లేకుండా రుణాలు పొంది ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించి తమ కాళ్ల మీద నిలబడిన మహిళలు జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కేవలం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం మాత్రమే కాదు.. అమ్మ ఒడి, ఆసరా, ఆటో ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇలా ఒక్క కుటంబానికే పలు రకాల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోంది.
ఈ పథకం ద్వారా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ప్రతి గ్రూప్ నకు కూడా ఈ పథకం ద్వారా మేలు చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతోంది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు బాసటగా నిలుస్తోంది.
ఒక అమ్మ ఒడి కావచ్చు. పింఛన్ల కానుక కావచ్చు.. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, మద్య నియంత్రణ, జలయజ్ఞం, ఫీజు రీయంబర్స్ మెంట్ ఇలా.. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి.