Ysrcp : బద్ధలవబోతున్న టీడీపీ కంచుకోటలు.. వైసీపీ వ్యూహాలు అదుర్స్
Ysrcp : ఏపీలో ఎన్నికలకు సమరం సిద్ధమైంది. వచ్చే సంవత్సరమే ఎన్నికలు. ఎండాకాలం పూర్తయ్యే సరికి ఏపీలో ఎన్నికల హడావుడి పూర్తవుతుంది. అందుకే ఇప్పటి నుంచే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అధికార వైఎస్సార్సీపీ పార్టీ కూడా ఈ ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఏదో గెలిచామా అంటే గెలిచాం అనేలా కాకుండా.. అన్ని అసెంబ్లీ స్థానాలపై గురి పెట్టింది. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుపు సాధించాలని పక్కా వ్యూహాలు రచిస్తోంది. రెండో చాన్స్ ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
అయితే.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడం మామూలు విషయం కాదు. అందుకే టీడీపీ బలంగా ఉన్న స్థానాలు, టీడీపీ సిట్టింగ్ స్థానాలపై వైసీపీ కన్ను వేసింది. టీడీపీ బలంగా ఉన్న కుప్పం, హిందూపురం, వైజాగ్ ఈస్ట్ లాంటి నియోజకవర్గాల్లో గెలవడం అనేది మామూలు విషయం కాదు. దాని కోసం వైసీపీ చాలా కష్టపడాలి. అందుకే ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాలపై దృష్టి సారించింది. కుప్పంలో గెలిస్తే వైసీపీ సత్తా చాటినట్టే అని భావిస్తున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్య నేతలను రంగంలోకి దించింది వైసీపీ.మంత్రి పెద్దిరెడ్డి హిందూపురంలో మకాం వేశారు. టీడీపీకి కంచుకోటలు అయినా ఈ నియోజకవర్గాల్లో ఎలాగైనా వైసీపీ గెలవాలన్న పట్టుపట్టింది. అలాగే..
Ysrcp : హిందూపురంలో మకాం వేసిన పెద్దిరెడ్డి
వైజాగ్ ఈస్ట్ కూడా టీడీపీకి కంచుకోటే. అక్కడ వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ సాధించారు. అందుకే.. ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. కీలక నేతలను అక్కడి నుంచి బరిలోకి దించాలని యోచిస్తోంది. వైసీపీ ఎంత కష్టపడ్డా ప్రజా బలం ఉన్న నేతలు అయితేనే అది సాధ్యం అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే.. ఆయా నియోజకవర్గాలపై పూర్తి స్థాయి ఫోకస్ ను ఇప్పటి నుంచే పెట్టారు. చూద్దాం మరి టీడీపీ కంచుకోటలను ఈసారైనా వైసీపీ బద్దలు కొడుతుందో లేదో?