Ysrcp : ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు బీజేపీలోకి జంప్ అయ్యారా.. సంక్షోభం తప్పదా..?
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కేర్ చేయని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు చల్లబడ్డారు . అప్పట్లో పార్లమెంట్ నుంచి పంచాయతీ వార్డు మెంబర్ దాకా ఎక్కడ చూసినా వైసీపీ వేరే అన్నట్లుగా ఉండేది. వైసీపీలో ఎన్నో గొంతుకలు కూడా ఉండేవి. ఎపుడైతే వైసీపీ భారీ ఓటమిని మూటకట్టుకుందో ఆనాటి నుంచి వైసీపీకి ఎడ తెగని కష్టాలు మొదలయ్యాయి. […]
ప్రధానాంశాలు:
Ysrcp : ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు బీజేపీలోకి జంప్ అయ్యారా.. సంక్షోభం తప్పదా..?
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కేర్ చేయని ఆ పార్టీ నాయకులు ఇప్పుడు చల్లబడ్డారు . అప్పట్లో పార్లమెంట్ నుంచి పంచాయతీ వార్డు మెంబర్ దాకా ఎక్కడ చూసినా వైసీపీ వేరే అన్నట్లుగా ఉండేది. వైసీపీలో ఎన్నో గొంతుకలు కూడా ఉండేవి. ఎపుడైతే వైసీపీ భారీ ఓటమిని మూటకట్టుకుందో ఆనాటి నుంచి వైసీపీకి ఎడ తెగని కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా తెలియని పరిస్థితి. వైసీపీకి వీరు ఉన్నారు కొండంత అండగా అని అధికారంలో ఉన్నపుడు చెప్పుకున్న వారంతా ఇపుడు చడీ చప్పుడూ చేయడం లేదు.
Ysrcp పవన్, లోకేష్ దెబ్బకు..
అయితే వైసీపీలో నుంచి బయటకు వెళ్లేవారు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వివిధ కారణాలు చెప్పి పార్టీని వీడిపోయారు. ఇపుడు మరింత మంది అదే బాటలో పయనిస్తున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరో వైపు చూసుకుంటే వైసీపీలో దిగ్గజ నేతలుగా ఒకనాడు చెప్పుకునే వారు అంతా పార్టీని వీడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పడు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు వైసీపీ గేటు దాటనున్నారు అన్నది తాజాగా వైరల్ అవుతున్న న్యూస్. వైసీపీలో ఏం జరుగుతుంది, అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచే విషయం. వైసీపీలో ఆరుగురు మాజీ మంత్రులు ఏకంగా బీజేపీలోకి జంప్ చేస్తారు అని టాక్ అయితే నడుస్తోంది.
వీరంతా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ దెబ్బకు హడలిపోతున్నారు అని అంటున్నారు. రెండు బుక్ లో ఇప్పటికి రెండు చాప్టర్లు పూర్తి అయ్యాయి, మూడవ చాప్టర్ తెరుస్తామని ఇటీవలే లోకేష్ అమెరికా టూర్ లో చెప్పారు. దాంతో రెడ్ బుక్ లో మూడవ చాప్టర్ లో చాలామంది బిగ్ షాట్స్ వైసీపీకి చెందిన మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయని కూడా అంటున్నారు. దాంతో వారంతా వణుకుతున్నారు అని అంటున్నారు. మరోవైపు ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ చేసిన కామెంట్స్ తో కూటమి ప్రభుత్వంలో ఒక రకమైన ప్రకంపనలు వచ్చాయి. బిగ్ షాట్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ వరసలో వైసీపీ లో మంత్రులుగా పనిచేసి టీడీపీ జనసేన మీద బిగ్ సౌండ్ తో విరుచుకుపడిన వారందరి మీద కన్ను ఉందని అంటున్నారు. అయితే ఆరుగురు మాజీ మంత్రులు ఎవరు ఏమిటి ఆ కధ అంటే వీరిలో ఎక్కువ మంది కోస్తా జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అంటున్నారు.