Categories: andhra pradeshNews

Ysrcp : ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు బీజేపీలోకి జంప్ అయ్యారా.. సంక్షోభం త‌ప్ప‌దా..?

Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం చెంద‌డంతో ఇంకా సంక్షోభం కొన‌సాగుతూనే ఉంది. అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రిని కేర్ చేయ‌ని ఆ పార్టీ నాయ‌కులు ఇప్పుడు చ‌ల్ల‌బ‌డ్డారు . అప్ప‌ట్లో పార్లమెంట్ నుంచి పంచాయతీ వార్డు మెంబర్ దాకా ఎక్కడ చూసినా వైసీపీ వేరే అన్నట్లుగా ఉండేది. వైసీపీలో ఎన్నో గొంతుకలు కూడా ఉండేవి. ఎపుడైతే వైసీపీ భారీ ఓటమిని మూటకట్టుకుందో ఆనాటి నుంచి వైసీపీకి ఎడ తెగని కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా తెలియని పరిస్థితి. వైసీపీకి వీరు ఉన్నారు కొండంత అండగా అని అధికారంలో ఉన్నపుడు చెప్పుకున్న వారంతా ఇపుడు చడీ చప్పుడూ చేయడం లేదు.

Ysrcp ప‌వ‌న్, లోకేష్ దెబ్బ‌కు..

అయితే వైసీపీలో నుంచి బయటకు వెళ్లేవారు కూడా చాలా మంది కనిపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వివిధ కారణాలు చెప్పి పార్టీని వీడిపోయారు. ఇపుడు మరింత మంది అదే బాటలో పయనిస్తున్నట్లుగా ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరో వైపు చూసుకుంటే వైసీపీలో దిగ్గజ నేతలుగా ఒకనాడు చెప్పుకునే వారు అంతా పార్టీని వీడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌డు ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు వైసీపీ గేటు దాటనున్నారు అన్నది తాజాగా వైరల్ అవుతున్న న్యూస్. వైసీపీలో ఏం జ‌రుగుతుంది, అనేది ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తిని పెంచే విష‌యం. వైసీపీలో ఆరుగురు మాజీ మంత్రులు ఏకంగా బీజేపీలోకి జంప్ చేస్తారు అని టాక్ అయితే నడుస్తోంది.

Ysrcp : ఏకంగా ఆరుగురు మాజీ మంత్రులు బీజేపీలోకి జంప్ అయ్యారా.. సంక్షోభం త‌ప్ప‌దా..?

వీరంతా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ దెబ్బకు హడలిపోతున్నారు అని అంటున్నారు. రెండు బుక్ లో ఇప్పటికి రెండు చాప్టర్లు పూర్తి అయ్యాయి, మూడవ చాప్టర్ తెరుస్తామని ఇటీవలే లోకేష్ అమెరికా టూర్ లో చెప్పారు. దాంతో రెడ్ బుక్ లో మూడవ చాప్టర్ లో చాలామంది బిగ్ షాట్స్ వైసీపీకి చెందిన మాజీ మంత్రుల పేర్లు ఉన్నాయని కూడా అంటున్నారు. దాంతో వారంతా వణుకుతున్నారు అని అంటున్నారు. మ‌రోవైపు ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ చేసిన కామెంట్స్ తో కూటమి ప్రభుత్వంలో ఒక రకమైన ప్రకంపనలు వచ్చాయి. బిగ్ షాట్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఆ వరసలో వైసీపీ లో మంత్రులుగా పనిచేసి టీడీపీ జనసేన మీద బిగ్ సౌండ్ తో విరుచుకుపడిన వారందరి మీద కన్ను ఉందని అంటున్నారు. అయితే ఆరుగురు మాజీ మంత్రులు ఎవరు ఏమిటి ఆ కధ అంటే వీరిలో ఎక్కువ మంది కోస్తా జిల్లాలకు చెందిన వారు ఉన్నారని అంటున్నారు.

Recent Posts

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

26 minutes ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

1 hour ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

2 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

3 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

4 hours ago

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

5 hours ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

14 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

14 hours ago