Ysrcp : టిడిపి వ్యూహాలను తిప్పి కొడుతున్న వైసిపి… ముల్లును ముల్లుతో తీసినట్లుగా వ్యూహరచనలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : టిడిపి వ్యూహాలను తిప్పి కొడుతున్న వైసిపి… ముల్లును ముల్లుతో తీసినట్లుగా వ్యూహరచనలు..!

Ysrcp : ఒకానొక సందర్భంలో చేతిలో మీడియాని బలంగా పెట్టుకొని ప్రత్యర్ధులతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకులపై చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాలు చేసేవారు. అలాగే తన గురించి చాలా గొప్పగా ప్రచారాలు చేసుకునేవారు. అపర చాణక్యుడని ప్రపంచ మేధావిగా హైదరాబాదును నిర్మించిన పాలకుడిగా , హైదరాబాద్ కు ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన విజనరీగా చెబుతూ ప్రజలలో చంద్రబాబుకు మంచి ఇమేజ్ తీసుకురావడానికి ఎల్లో మీడియా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పాలి.అయితే ఇదంతా ప్రత్యామ్నాయ మీడియా లేని […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 January 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : టిడిపి వ్యూహాలను తిప్పి కొడుతున్న వైసిపి... ముల్లును ముల్లుతో తీసినట్లుగా వ్యూహరచనలు..!

Ysrcp : ఒకానొక సందర్భంలో చేతిలో మీడియాని బలంగా పెట్టుకొని ప్రత్యర్ధులతో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకులపై చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాలు చేసేవారు. అలాగే తన గురించి చాలా గొప్పగా ప్రచారాలు చేసుకునేవారు. అపర చాణక్యుడని ప్రపంచ మేధావిగా హైదరాబాదును నిర్మించిన పాలకుడిగా , హైదరాబాద్ కు ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన విజనరీగా చెబుతూ ప్రజలలో చంద్రబాబుకు మంచి ఇమేజ్ తీసుకురావడానికి ఎల్లో మీడియా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పాలి.అయితే ఇదంతా ప్రత్యామ్నాయ మీడియా లేని రోజుల్లో జరిగిందని చెప్పాలి.కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా బలోపేతం అయిన కారణంగా ఇలాంటివి చేయడానికి చంద్రబాబుకు పప్పులు ఉడకడం లేదని చెప్పాలి. చంద్రబాబు చానక్యుడు కాదని వెన్నుపోటు దారుడని , సీనియర్ ఎన్టీఆర్ ను గద్ద దించే క్రమంలో ఎలాంటి కుట్రలకు తెర లేపారు అనే విషయాలను లోకానికి బలంగా చూపించగలిగారు . అదేవిధంగా హైదరాబాద్ కు ఐటి రంగం రాడానికి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉందని తెలిసేలా చేశారు.

ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు చంద్రబాబు గురించి గొప్పగా చెప్పిన ఎన్నో ప్రచారాలు అవాస్తవాలుగా సోషల్ మీడియా బయటపెట్టింది. ఇక ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ప్రత్యర్థులపై ఎల్లో బ్యాచ్ ఉన్నది లేనిది రాస్తూ ప్రజల్ని ప్రభావితం చేస్తుందని రాజకీయంగా లబ్ధి పొందేందుకు వారు విషాన్ని చిమ్మడానికైనా వెనకాడరని సోషల్ మీడియా బయటపెట్టింది. అయితే ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో టిడిపి అగ్ర నేతలతో పలానా వైసిపి నాయకులు భేటీ అయ్యారంటూ ఎల్లో బ్యాచ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ ఇప్పుడు వైసీపీ కూడా అలాంటి విద్యలలో ఆరితేరిందని చెప్పాలి.ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతను గుర్తుచేసుకొని ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని వైసిపి పునికి పుచ్చుకుందని చెప్పాలి. ఎందుకంటే తాజాగా నారా లోకేష్ తో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారంటూ ఎన్నోసార్లు ఎల్లో మీడియా ప్రచారాలు చేసింది.

ఈ నేపథ్యంలోనే టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీలోకి వస్తున్నారనే ప్రచారాన్ని అధికార పార్టీ అనుకూల మీడియా ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా కంగుతున్న టిడిపి నాయకుడు ఎరపతినేని నేను పార్టీ మారడం లేదని సోషల్ మీడియా వేదికగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఇక వైసీపీలో బలమైన నాయకులుగా పేరుపొందిన రాజకీయ నాయకుల భవిష్యత్తుతో టిడిపి మైండ్ గేమ్ ఆడుతుందన్న నేపథ్యంలో వారికి దీటుగా ఇప్పుడు అధికార పార్టీ అదే తరహాలో వారిని తిప్పి కొడుతుందని చెప్పాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది