ys jagan : ‘అన్నా భయంగా ఉంది’ జగన్ దగ్గరే వాపోతున్న మంత్రులు ?
ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత వద్దనుకున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవ్వక తప్పడం లేదు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన వైఎస్ జగన్ చివరకు సుప్రీం ఆదేశాలతో ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించాడు అనడంలో సందేహం లేదు. నిమ్మగడ్డ రమేష్ చాలా హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం వైకాపా నాయకులు అంతా కూడా ఎలాగూ ఎన్నికలు జరుగవులే అనే ఉద్దేశ్యంతో తాపీగా ఉన్నారు. కాని సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికలు జరిగేలా ఉన్నాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నాయకులు జనాల్లో ఉన్నారు. వారికి పెద్ద ఎత్తున జనాల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలోనే వైకాపా నాయకులు మాత్రం చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల హడావుడి మొదలు అవ్వడంతో వైకాపా నాయకులు క్షేత్ర స్థాయిలో వెళ్లేందుకు కష్టపడుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల విషయంలో వైకాపా నాయకులు ఒకింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం వైకాపా కు జనాల్లో పాజిటివ్ గానే ఉన్నా కూడా ఎన్నికల బూత్ ల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైకాపా నాయకులు చాలా మంది సీఎం వైఎస్ జగన్ వద్దకు క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక వైపు ఎస్ ఈ సీ డబ్బు పంపిణీ చేయకుండా ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైకాపా గెలుపు గురించి జనాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.
సంక్షేమ పథకాలను ఎంతగా ప్రచారం చేసినా కూడా జనాలు డబ్బుకు మాత్రమే ఓటు వేస్తారేమో అనే అనుమానాలు ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ నుండి ఏమైనా సలహాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో అన్నా భయంగా ఉంది అంటూ కొందరు వైకాపా నాయకులు మరియు అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మాత్రం నిమ్మగడ్డ రమేష్ కు భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు అందరు కూడా మన వారే అన్నట్లుగా వారికి సూచిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైకాపా నాయకులు వైఎస్ జగన్ పై నమ్మకంతో ఎన్నికలకు సిద్దం అవుతున్నారు.