Mithun Reddy : అప్పుడు చంద్రబాబు ఉంచిన బ్లాక్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
జైలు అధికారులను మిథున్ రెడ్డి కోరిన కోరిక అదే
రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేటాయించిన నెంబర్ ఇదే
Mithun Reddy : అప్పుడు చంద్రబాబు ఉంచిన బ్లాక్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం రాత్రి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అరెస్టు చేసింది. విజయవాడ సిట్ కార్యాలయంలో సుమారు ఏడుగంటల పాటు విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకొని, ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆసక్తికరంగా ఆయనకు కేటాయించిన బ్లాక్ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్న స్నేహ బ్లాక్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Mithun Reddy : అప్పుడు చంద్రబాబు ఉంచిన బ్లాక్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
Mithun Reddy : జైలు అధికారులను మిథున్ రెడ్డి కోరిన కోరిక అదే
మిథున్ రెడ్డికి జైలు అధికారులు రిమాండ్ ఖైదీ నెంబర్ 4196 కేటాయించారు. జైలు అధికారులను కలిసి ఆయన కోరిన కోరికల మేరకు, మౌలిక వసతులు కలిగిన స్నేహ బ్లాక్‌ను కేటాయించారు. అయితే ఆయన ఓ టీవీ ఏర్పాటు చేయాలనీ కోరినట్లు తెలుస్తుంది. కాసేపట్లో మిథున్ తరఫున లాయర్ ఆయన్ను కలవనున్నారు. సిట్ అధికారులు దాఖలు చేసిన ప్రాథమిక ఛార్జ్‌షీట్ ప్రకారం, లిక్కర్ పాలసీ రూపకల్పనలో, షెల్ కంపెనీల ద్వారా అవినీతి, మనీలాండరింగ్ వంటి విషయాల్లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 300 పేజీల ఛార్జ్‌షీట్, 268 మంది సాక్షుల వివరాలు సమర్పించినట్లు కోర్టుకు తెలియజేశారు. కేసులో రూ.62 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇక వైసీపీ నేతలు మిథున్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. మిథున్ తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ అరెస్టును పూర్తిగా రాజకీయ కక్షతో కూడినదిగా అభివర్ణించారు. మిథున్ ఎలాంటి తప్పూ చేయలేదని, చట్టపరంగా నిర్దోషిగా బయటకు వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. తాము న్యాయపరంగా పోరాడుతామని, రాజకీయ కక్షలు ఎంతగా వచ్చినా, నిజం వెలుగు చూస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. దీంతో మిథున్ రెడ్డి అరెస్ట్ కేసు రాజకీయ వేదికపై మరో మలుపు తిరిగింది.