YSRCP : ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో వైకాపా మెజార్టీ పంచాయితీ స్థానాలను దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. ఏకగ్రీవాలతో కలిపి దాదాపుగా 80 నుండి 85 శాతం వరకు పంచాయితీలను వైకాపా గెలుచుకుంటుంది అంటూ సమాచారం అందుతోంది. ఈ జోరులోనే పరిషత్ ఎన్నికలు మరియు మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందుకు ఎస్‌ఈసీ కూడా ముందుకు రావడం జరిగింది. గత ఏడాది మార్చిలో ఆగిపోయిన పక్రియను మళ్లీ అక్కడ నుండే మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అన్ని చోట్ల వైకాపాకు ఘన విజయం దక్కడం ఖాయం. కాని వైజాగ్ లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఏంటీ అనేది అర్థం అవ్వడం లేదు. అదే వైజాగ్ మేయర్ ఎన్నికలు. అక్కడ మొత్తం ఉన్న 98 డివిజన్లలో వైకాపా పోటీ చేసి 60 నుండి 70 వరకు స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైకాపా గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విశాఖ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైజాగ్ స్ట్రీల్ ను ప్రైవేటీకరన చేయడం అందుకు వైకాపా నుండి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం వంటి కారణాల వల్ల జనాలు ముఖ్యంగా వైజాగ్ స్టీల్ తో అనుబంధం ఉన్న వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది కొందరు అభిప్రాయం. అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా వైకాపా వచ్చే నెలలో జరుగబోతున్న మేయర్ ఎన్నికల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూకుడుగా ఉన్న వైకాపాకు అక్కడ ఒక్క చోట నిరాశ ఎదురైనా కూడా తెలుగు దేశం పార్టీ పుంజుకోవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధానిని వైజాగ్ కు తరలించాలని ప్రతిపాధించాడు. అదే జరిగితే ఖచ్చితంగా వైజాగ్ జనాలు ఫుల్ హ్యాపీ. కాని ఇప్పటి వరకు అది అతి గతి లేకుండా పోయింది. ఏడాదిన్నరగా వైజాగ్ కు రాజధాని తరలింపు ఫైల్ కదలడం లేదు. ఇలాంటి సమయంలో వైజాగ్ స్టీల్ కు సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. కనుక వైజాగ్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైకాపా గెలుపు సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాలకు సంబంధించిన చర్చల ప్రకారం వైజాగ్ పూర్తిగా వైకాపాకు వ్యతిరేకంగా మారిపోయిందని కనుక అక్కడ ఒక్క చోట ఎన్నికలు వాయిదా వేయించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ అక్కడ కుమ్మేస్తుందని అంటున్నారు. బీజేపీతో జనసేన పార్టీ జోడీ కట్టింది కనుక ఆ కూటమిని కూడా జనాలు ఆధరించక పోవచ్చు అంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.