Nagarjuna : నాగార్జున నిర్మాతగా పలువురు యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించి సూపర్ హిట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా అంటే గ్యారెంటీగా హిట్ అన్న టాక్ అందరిలోను ఉంటుంది. హీరోలకి భారీ హిట్ దక్కుతుంది. నాగార్జున ది లక్కీ హ్యాండ్.. ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ అయింది. హీరోలే కాదు ఈ బ్యానర్ నుంచి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ లాంటి వాళ్ళు దర్శకులుగా మారి స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. ఇక ఇప్పటికే పలువురు హీరోయిన్స్ కూడా అన్నపూర్ణ బ్యానర్లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్నారు.
nagarjuna-Vaishnav Tej in Nagarjuna production announcement .will be very soon
ఆ లిస్ట్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లాంటి వాళ్ళు కూడా ఉండటం విశేషం. కాగా ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున నిర్మాతగా ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుందని లేటెస్ట్ న్యూస్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. అందరు వైష్ణవ్ తేజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ సినిమా అనగానే చర్చలు మామూలుగా లేవు.
ఇక వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ ఇప్పటికే కంప్లీట్ అయింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఒక సినిమా లో నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కొండపోలం అన్న నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని అంటున్నారు. ఈ కారణంగానే క్రిష్ ఈ సినిమాకి కొండపొలం అన్న టైటిల్ నే పెట్టాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం. కాగా మూడవ సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కనుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇక అక్కినేని హీరోలతో మెగా బ్యానర్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి నాగార్జున – వైష్ణవ్ తేజ్ సినిమా ఎప్పుడు అనౌన్స్ మెంట్ వస్తుందో చూడాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.