YSRCP : ఆ ఒక్క చోట గెలుపు విషయమై భయపడుతున్న జగన్‌.. అక్కడ టీడీపీ కుమ్మేయడం ఖాయమట | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : ఆ ఒక్క చోట గెలుపు విషయమై భయపడుతున్న జగన్‌.. అక్కడ టీడీపీ కుమ్మేయడం ఖాయమట

 Authored By himanshi | The Telugu News | Updated on :17 February 2021,2:29 pm

YSRCP : ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో వైకాపా మెజార్టీ పంచాయితీ స్థానాలను దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. ఏకగ్రీవాలతో కలిపి దాదాపుగా 80 నుండి 85 శాతం వరకు పంచాయితీలను వైకాపా గెలుచుకుంటుంది అంటూ సమాచారం అందుతోంది. ఈ జోరులోనే పరిషత్ ఎన్నికలు మరియు మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందుకు ఎస్‌ఈసీ కూడా ముందుకు రావడం జరిగింది. గత ఏడాది మార్చిలో ఆగిపోయిన పక్రియను మళ్లీ అక్కడ నుండే మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అన్ని చోట్ల వైకాపాకు ఘన విజయం దక్కడం ఖాయం. కాని వైజాగ్‌ లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఏంటీ అనేది అర్థం అవ్వడం లేదు. అదే వైజాగ్ మేయర్‌ ఎన్నికలు. అక్కడ మొత్తం ఉన్న 98 డివిజన్లలో వైకాపా పోటీ చేసి 60 నుండి 70 వరకు స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైకాపా గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

YSRCP not going well in GVMC elections

YSRCP not going well in GVMC elections

విశాఖ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైజాగ్ స్ట్రీల్‌ ను ప్రైవేటీకరన చేయడం అందుకు వైకాపా నుండి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం వంటి కారణాల వల్ల జనాలు ముఖ్యంగా వైజాగ్‌ స్టీల్‌ తో అనుబంధం ఉన్న వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది కొందరు అభిప్రాయం. అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా వైకాపా వచ్చే నెలలో జరుగబోతున్న మేయర్‌ ఎన్నికల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి రావచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దూకుడుగా ఉన్న వైకాపాకు అక్కడ ఒక్క చోట నిరాశ ఎదురైనా కూడా తెలుగు దేశం పార్టీ పుంజుకోవడం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రాజధానిని వైజాగ్ కు తరలించాలని ప్రతిపాధించాడు. అదే జరిగితే ఖచ్చితంగా వైజాగ్ జనాలు ఫుల్‌ హ్యాపీ. కాని ఇప్పటి వరకు అది అతి గతి లేకుండా పోయింది. ఏడాదిన్నరగా వైజాగ్ కు రాజధాని తరలింపు ఫైల్ కదలడం లేదు. ఇలాంటి సమయంలో వైజాగ్‌ స్టీల్ కు సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. కనుక వైజాగ్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో వైకాపా గెలుపు సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాజకీయ వర్గాలకు సంబంధించిన చర్చల ప్రకారం వైజాగ్ పూర్తిగా వైకాపాకు వ్యతిరేకంగా మారిపోయిందని కనుక అక్కడ ఒక్క చోట ఎన్నికలు వాయిదా వేయించేందుకు జగన్ మోహన్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ అక్కడ కుమ్మేస్తుందని అంటున్నారు. బీజేపీతో జనసేన పార్టీ జోడీ కట్టింది కనుక ఆ కూటమిని కూడా జనాలు ఆధరించక పోవచ్చు అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది