Ysrcp : ఏపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటామంటూ గాంభీర్యాలు పోయిన వైసీపీకి పెద్ద దెబ్బే తగిలింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓటమి పాలైంది. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి పని చేసిన చాలా మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకి చెందిన కొందరు వైసీపీకి సపోర్ట్ చేయగా, ఇప్పుడు వారు మళ్లీ చిత్ర పరిశ్రమలో కనిపిస్తారా? అవకాశాలు వస్తాయా అని చర్చగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సినీ రంగం ప్రభావం చాలా ఎక్కువ. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం చక్రం తిప్పుతుండగా, అసెంబ్లీ ఎన్నికల వరకు వైసీపీ నేతలు రోజా, పోసాని కృష్ణమురళి, హస్యనటుడు అలీ ఓ వెలుగు వెలిగారు.
వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన రోజా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌తో రాజకీయంగా విభేదించడమే కాకుండా, వ్యక్తిగత విమర్శలతో వివాదాస్పదమయ్యారు అయితే వైసీపీ ఓడిపోవడంతో ఆమె సినీ రంగంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అవకాశాలు దక్కుతాయా? లేదా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. రోజాకు అవకాశమిచ్చి ఏపీ ప్రభుత్వం దృష్టిలో పడటమెందుకు? అని ఎక్కువ మంది నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీలో పనిచేసిన మరో నటుడు పోసాని కృష్ణమురళి కెరీర్‌పైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పోసాని వైసీపీలో శ్రుతిమించిన విమర్శలతో వివాదాస్పదమయ్యారు. సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించి టీడీపీ, జనసేనలకు టార్గెట్ అయ్యారు. వైసీపీలో చేరిన తర్వాత విమర్శలతో విరుచుకుపడటం ఆయన కెరీర్‌ను డేంజర్ జోన్‌లోకి తీసుకువెళ్లిందని అంటున్నారు సినీ పండితులు. గతంలో మాదిరిగా మళ్లీ పోసాని స్క్రీన్‌పై కనిపించడం అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థి గుంపులో పనిచేయడం వల్ల అలీకి అవకాశాలిచ్చి పవన్ ఆగ్రహానికి గురవ్వడమెందుకని కొందరు నిర్మాతలు తటపటాయిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం అలీ చేతిలో ఒక షో తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు. ఇక నటి, యాంకర్ శ్యామల పరిస్థితి కూడా ప్రశార్థకంగా ఉంది. కరెక్ట్ గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సహాయం చేయడం నేనెప్పుడూ చూడలేదు అంటూ పలు విమర్శలు చేసింది. దీంతో జనసైనికులు పవన్ గెలిచాక ఆమెని సోషల్ మీడియాలో బాగా టార్గెట్ చేసారు. యాంకర్ గా అయితే ఎవరూ సినిమా ఈవెంట్లకు, ఇంటర్వ్యూలకు పిలిచే పరిస్థితి కనపడట్లేదు. మరి శ్యామల ఏం చేస్తుందో చూడాలి.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.