Ysrcp Manifesto : మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ఇటీవల అధికార పార్టీ వైసీపీ విడుదల చేసింది. ఇక ఈ మ్యానిఫెస్టోకు నవరత్నాలు ప్లస్ అని పేరు పెట్టారు. ఈ విధంగా పేరు పెట్టడానికి గల ముఖ్య కారణం గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలను కొనసాగించడం అని చెప్పాలి.కానీ ఈసారి ఈ నవరత్నాల లబ్ధిని మరింత పెంచడం జరిగింది. దీంతో ఈ మేనిఫెస్టోకు నవరత్నాల ప్లస్ టైటిల్ ను జోడించారు . ఈ క్రమంలోనే తాడేపల్లి వైసీపీ పార్టీ ఆఫీసులో ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈనేపథ్యంలోనే మరోసారి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీలతో కూడిన మేనిఫెస్టోను తీసుకువచ్చారు. ఇక ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నవరత్నాలు పథకాలనే మళ్లీ ప్రకటించారు. కానీ ఈ పథకాలలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టడం జరిగింది. ఇక ఈ మేనిఫెస్టోలో విద్య ,ఆరోగ్యం, వ్యవసాయం ,సామాజిక భద్రత ,అభివృద్ధి , మౌలిక వసతులు, సుపరిపాలన,పోర్ట్స్ నిర్మాణం, వాలంటీర్లు వ్యవస్థ వంటివి ఉండనున్నట్లు తెలియజేశారు.
మహిళలకు సంబంధించి వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ల వయసుగలవారికి ఐదు సంవత్సరాలలో ₹1,50,000 దాకా పెంచుకుంటూ పోతామని తెలియజేశారు.
Ysrcp Manifesto : అలాగే అమ్మఒడి పథకం కింద రూ.17,000 ఉన్నట్టు తెలియజేశారు.
అలాగే వైయస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా గతంలో నాలుగు ధపాలలో 60 వేలు ఇవ్వగా దీనిని ఇప్పుడు వచ్చే ఐదేళ్లలో లక్ష ఇరవై వేలు చేయనున్నట్లు తెలిపారు.
అలాగే వైయస్ఆర్ కళ్యాణమస్తు ,షాది తోఫా వాటివి కొనసాగుతాయని తెలియజేశారు.
అదేవిధంగా వైయస్ఆర్ సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల వారికి 3 లక్షల దాకా సున్నా వడ్డీ పై రుణాలు వస్తాయని తెలిపారు.
పేదలకు పెన్షన్ 3000 నుండి 3500 పెంచుతామని తెలియజేశారు.
రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఇదివరకు 13,500 ఇవ్వగా ఈసారి అధికారంలోకి వస్తే దానిని 16 వేలకు పెంచుతామని తెలిపారు.
అదేవిధంగా పేదలకు ఇండ్ల నిర్మాణం కూడా కొనసాగించే విధంగా పథకాలు తీసుకొస్తామని జగన్ తెలియజేశారు. ఇక ఈ మేనిఫెస్టోను ఆన్ లైన్ లో పెడతామని ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. మొత్తంగా వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో చాలా పథకాల లో పెంపు లేనప్పటికీ కొన్ని పథకాలలో మాత్రం స్వల్పంగా మనీ పెంచారు. ఇక ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ మాట్లాడుతూ… అధికారంలోకి వస్తే విశాఖ నుండి తమ పాలన మొదలు పెడతామని ,మూడు రాజధానుల విషయంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.