Ysrcp : ఫైర్ తగ్గిన వైసీపీ…. అధినేత ఇప్పటికీ తెలుసుకోకపోతే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : ఫైర్ తగ్గిన వైసీపీ…. అధినేత ఇప్పటికీ తెలుసుకోకపోతే..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 December 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : ఫైర్ తగ్గిన వైసీపీ.... అధినేత ఇప్పటికీ తెలుసుకోకపోతే..!

Ysrcp : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ఐతే వైసీపీ కూటమి పాలనను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా టార్గెట్ చేస్తుంది. ఐతే దీనిపై కూటమి తగినట్టుగానే సమాధానం ఇస్తుంది. ఐతే వైసీపీ అధినేత కూటమి పట్ల తన అసంతృప్తిని తెలిపినట్టు తెలుపుతూనే తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం పార్టీ నేతలను కన్ ఫ్యూజ్ చేస్తుంది. అసలే వైసీపీ హయాంలో జరిగిన ఒక్కో అవినీతి కూటమి బయట పెడుతుంటే లేటెస్ట్ గా లంచాల విషయంలో వైసీపీ లంచాల వ్యవహారం తెర మీదకు వచ్చింది.

దీనిపై జగన్ నుంచి సీరియస్ రెస్పాన్స్ వస్తుందని భావించారు కానీ అది కాకుండా మిగతా విషయాలను మాట్లాడుతున్నారు జగన్. ముఖ్యంగా తనకు సన్మానాలు చేయాలి.. శాలువాలు కప్పలని చెబుతున్నాడు. అంతేనా ఏదైనా అవార్డ్ ఇవ్వాల్సి వస్తే అది తనకే ఇవ్వాలని కూడా అంటున్నారు. ఇలా చెప్పాలంటే చంద్రబాబుకి చాలా శాలువాలు కప్పాల్సి ఉంటుంది. అనేక అవార్డులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. విభజన రాష్ట్రంగా ఆయన అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. హైకోర్ట్ ని కట్టించారు. సచివాలయాలు నిర్మించారు. రోడ్లు కూడా వేయించడం జరిగింది. జగన్ టైం లో ఇవేవి జరగలేదు.

Ysrcp ఫైర్ తగ్గిన వైసీపీ అధినేత ఇప్పటికీ తెలుసుకోకపోతే

Ysrcp : ఫైర్ తగ్గిన వైసీపీ…. అధినేత ఇప్పటికీ తెలుసుకోకపోతే..!

Ysrcp జగన్ ప్రభుత్వంలో నిర్వహించాల్సిన శాసన సభలు..

పైపెచ్చు జగన్ ప్రభుత్వంలో నిర్వహించాల్సిన శాసన సభలు, మండలి సమావేశాలు కూడా బాబు కట్టించిన భవనాల్లోనే జరిగాయి. బాబుకే శాలువాలు కప్పాలని తమ్ముళ్లు అంటుంటే కాదు తనకు సన్మానాలు చేయాలని జగన్ అంటున్నారు. తన అనుభవంతో బాబు ఈ వయసులో కూడా అలుపెరగని శ్రామికుడిగా కష్టపడుతున్నారు. కానీ 50 ప్లస్ ఉన్న జగన్ అధికారం కోల్పోయే సరికి బయట కాలు పెట్టట్లేదు.

ఇలా చెప్పడానికి చాలా ఎక్సాంపుల్స్ ఉన్నాయని అంటున్నారు కొందరు. ఐతే బాబుకి సన్మాలు శాలువాలని తెలుగు తమ్ముళ్లు అంటుంటే.. జగనేమో మరోపక్క తనకు సన్మానాలు చేయాలని అంటున్నారు. ఈ కామెంట్స్ చూస్తే వైసీపీలో కాస్త ఫైర్ తగ్గిందని అనిపిస్తుంది. పార్టీని ఇంకా బలంగా ముందుకు నడిపించాలి అంటే ఇంకాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకానీ సన్మానాలు, అవార్డులు అంటే పని అవ్వదని కొందరు వైసీపీ శ్రేణులు కూడా చెప్పుకుంటున్నారు. Ysrcp YS Jagan, Chandrababu, Andhra Pradesh, Politics, YSRCP, AP

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది