రావ‌డం.. పోవ‌డం స‌హ‌జం… అయినా జ‌గ‌న్‌కు తిరుగులేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

రావ‌డం.. పోవ‌డం స‌హ‌జం… అయినా జ‌గ‌న్‌కు తిరుగులేదు..!

YV Subba Reddy : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఏపీలో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా మరోసారి 2024 లో బరిలోకి దిగుతోంది వైసీపీ పార్టీ. 2019 ఎన్నికల్లో 150కి పైగా సీట్లు వస్తే ఈసారి మాత్రం 175 సీట్లకు 175 సీట్లు రావాల్సిందే అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిక్స్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 December 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తాం

  •  వైసీపీలో సిట్టింగ్ ల మార్పు అందుకే

  •  చంద్రబాబు కుతంత్రాలు జగన్ మీద పని చేయవు

YV Subba Reddy : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఏపీలో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా మరోసారి 2024 లో బరిలోకి దిగుతోంది వైసీపీ పార్టీ. 2019 ఎన్నికల్లో 150కి పైగా సీట్లు వస్తే ఈసారి మాత్రం 175 సీట్లకు 175 సీట్లు రావాల్సిందే అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే పార్టీలో పలు సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వైసీపీలో భారీ ప్రక్షాళన జరుగుతోంది. సిట్టింగ్ లను మార్చుతున్నారు. అది వైసీపీకి పెద్ద దెబ్బ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చ, హడావుడికి ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చెక్ పెట్టారు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైతే మార్పు అవసరం అని భావించామో అక్కడే ఇన్ చార్జీలను మార్చామన్నారు. సిట్టింగ్ లను పక్కన పెడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. 175 స్థానాలకు 175 స్థానాలు గెలవాలంటే ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేయాల్సిందే. అది తప్పదు.. ఏ పార్టీ అయినా అలాగే చేస్తుందన్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుంది.. దాని కోసం నాయకులు కూడా సహకరించాలి. కేవలం 175 స్థానాల్లో వైసీపీ గెలిచేందుకే ఈ మార్పులు తప్పితే వేరే ఉద్దేశంతో కాదు.. పార్టీని కొందరు వీడుతున్నా.. ఈ నిర్ణయం ఎవ్వరికి నచ్చకున్నా కూడా ఇబ్బందేం లేదు. ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నాయి. ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. చంద్రబాబు కాదు.. పవన్ కళ్యాణ్ కాదు.. ఇద్దరు కలిసి వచ్చినా కూడా జగన్ ను ఏం చేయలేరు. వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ ఈక కూడా పీకలేరు.. అని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

YV Subba Reddy : కేసు వల్లనే రాజధాని ఏర్పాటు ఆలస్యం

విశాఖకు పరిపాలన రాజధాని మార్పుపై కోర్టులో కేసు నడుస్తుండటం వల్లనే రాజధాని ఏర్పాటు ఆలస్యం అవుతోంది. బీసీలకు న్యాయం చేయడం కోసమే కొన్ని చోట్ల ఇన్ చార్జ్ లను మారుస్తున్నాం. వంశీకృష్ణ యాదవ్ కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది అందుకే.. అంటూ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది