IDBI Bank : మీకు తెలుగు రాయడం, చదవడం వచ్చా? .. అయితే బ్యాంకింగ్ రంగంలో భారీ ఉద్యోగాలు వివరాలివే ..!

Authored By Suma | The Telugu News | Updated on : 8 March 2026, 2:00 pm
  •  IDBI Bank : మీకు తెలుగు రాయడం, చదవడం వచ్చా? .. అయితే బ్యాంకింగ్ రంగంలో భారీ ఉద్యోగాలు వివరాలివే ..!

IDBI Bank : బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన IDBI Bank తాజాగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘O’ మరియు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 1300 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) పోస్టులు, 200 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ 2026 మార్చి 8 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 మార్చి 19 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం అని నిపుణులు సూచిస్తున్నారు.

Application for huge jobs in IDBI Bank has started.

IDBI Bank : మీకు తెలుగు రాయడం, చదవడం వచ్చా? .. అయితే బ్యాంకింగ్ రంగంలో భారీ ఉద్యోగాలు వివరాలివే ..!

IDBI Bank : విద్యార్హతలు మరియు వయోపరిమితి వివరాలు

ఈ నియామక ప్రక్రియలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘O’ మరియు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘A’ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. వయోపరిమితి విషయానికి వస్తే, అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించాలనుకునే యువతకు ఈ పోస్టులు మంచి అవకాశంగా మారనున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు కూడా ఈ ఉద్యోగాలు అనుకూలంగా ఉండటం విశేషం.

IDBI Bank : ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పలు దశల్లో జరుగుతుంది. మొదట అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి తరువాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అనంతరం చివరి దశగా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ మూడు దశల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి తుది నియామక అవకాశం లభిస్తుంది. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే, SC/ST/PwD అభ్యర్థులకు రూ.250 మాత్రమే చెల్లించాలి. ఇతర అన్ని వర్గాల అభ్యర్థులు రూ.1050 చెల్లించాలి. ఈ ఫీజును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేదా ఇతర అదనపు సర్వీస్ ఛార్జీలు ఉంటే వాటిని అభ్యర్థులే భరించాలి.

IDBI Bank : దరఖాస్తు విధానం

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు IDBI Bank అధికారిక వెబ్‌సైట్ను సందర్శించాలి. అక్కడ కెరీర్స్ సెక్షన్‌లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ ‘ఓ’ నియామకం 2026-27 లింక్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత Apply Online ఆప్షన్‌పై క్లిక్ చేసి కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేయాలి. చివరగా ఫీజు చెల్లించి ఫారం సమర్పించాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత భవిష్యత్తులో అవసరమైనందుకు అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకోవడం మంచిది. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ కోరుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp