Business Ideas : డబ్బులు సంపాదించాలంటే కేవలం జాబ్ మాత్రమే చేయాలా? ఒకప్పుడు జాబ్ మాత్రమే చేస్తే డబ్బు వస్తుంది అని అనుకునేవారు కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. జాబ్ చేయకున్నా.. ఇంట్లో కూర్చొని కూడా లక్షలు సంపాదించేవాళ్లు ఉన్నారు. ఉద్యోగం కన్నా.. ఏదైనా సొంత బిజినెస్ చేసుకొని తమ కాళ్ల మీద నిలబడాలని భావించేవారు ఎందరో. ప్రస్తుతం సొంత బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు కూడా పెరిగాయి. వాటిని అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా బిజినెస్ లో రాణించవచ్చు. అయితే కరోనా సమయంలో చాలామంది సొంత బిజినెస్ లను స్టార్ట్ చేశారు. అలా.. మంజరి సింగ్, తన అత్త హిరన్యమయి శివాణి కరోనా సమయంలోనే క్లౌడ్ కిచెన్ ప్రారంభించారు. నిజానికి వాళ్లది బీహార్ లోని పాట్నా. 2020 లో కరోనా ప్రారంభం అయ్యాక ఢిల్లీలో చిక్కుకుపోయారు.
పాట్నాకు వెళ్లలేకపోయారు. దీంతో తమకు ఎంతో ఇష్టమైన బీహారీ వంటలను మిస్ అయ్యారు. దీంతో తమ ఇంట్లోనే బీహారీ వంటలను వండటం ప్రారంభించారు. వాటిని రుచి చూసేవారు. దాన్నే బిజినెస్ గా ఎందుకు మలుచుకోకూడదు అనే ఆలోచనతో ప్రారంభించిందే ఈ క్లౌడ్ కిచెన్. జులై 2021 లో దది చౌంక్ అనే పేరుతో క్లౌడ్ కిచెన్ ను ప్రారంభించారు. బీహార్ కు చెందిన పలు స్పెషల్ వంటకాలను ఢిల్లీ వాసులకు రుచి చూపించడం స్టార్ట్ చేశారు. దాల్, భాట్, తర్కారి, రోటీ, లిట్టి చోకా, ఝల్మురి, అచర్ అనే స్పెషల్ వంటకాలను తయారు చేయడం ప్రారంభించారు. ఆన్ లైన్ లో ఆర్డర్ల ద్వారా ఫుడ్ ను సరఫరా చేసేవారు. మొదట్లో రోజుకు 40 ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. కానీ.. నేడు రోజుకు 450 కి పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం వాళ్లు నెలకు 4 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. ఏదో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసి ఫుడ్ ను సరఫరా చేయడం అనేదే కాకుండా..
చాలా టేస్టీగా, అందరికీ నచ్చేలా బీహార్ కు చెందిన పలు సంప్రదాయ వంటకాలను కూడా ఢిల్లీ వాసులకు రుచి చూపిస్తున్నారు. పర్యావరణ రహితంగా ఉండేలా గ్లాస్ కంటెయినర్స్ లో ఫుడ్ ను సరఫరా చేస్తారు. వివిధ ఫుడ్ యాప్స్ ద్వారా రోజుకు వందల ఆర్డర్స్ వస్తుండటంతో వాళ్ల బిజినెస్ బాగా నడుస్తోంది. నెలకు 4 లక్షలకు పైనే సంపాదిస్తూ తమ కాళ్ల మీద నిలబడ్డారు అత్తా కోడళ్లు. నిజానికి బీహార్ ఫుడ్ ఢిల్లీలో అంత ఈజీగా దొరకదు. ఎక్కడో ఒక రెస్టారెంట్ మాత్రమే బీహార్ ది కనిపిస్తుంది ఢిల్లీలో. కానీ.. ఇప్పుడు ఆన్ లైన్ లో అన్ని రకాల బీహార్ వంటకాలు దొరుకుతుండటంతో అది సంప్రదాయ వంటకాలు టేస్టీగా తమ ఇంట్లో చేసిన వంటకాల్లా ఉండటంతో ఢిల్లీలో ఉండే బీహార్ వాళ్లే కాదు.. ఢిల్లీ వాసులు కూడా ఆ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అత్తా కూతుళ్లకు సలామ్ చేస్తున్నారు. బీహార్ వంటకాలను ఢిల్లీ వాసులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.