Business Idea : చదువు పూర్తయ్యాక చాలా మంది ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. కొంతకాలానికి ఉద్యోగంలో చేరితో ఎలాగోలా జీవితంలో స్థిరపడాలని భావిస్తారు. కానీ కొందరికి స్కిల్స్ లేక మరికొందరికీ అదృష్టం కలిసి రాక తమ చదువుకు సంబంధం లేకుండా చిన్న ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుంది.కొంతకాలానికి అందులో సంతృప్తి చెందక వేరే జాబ్ కోసం ప్రయత్నిస్తూ తీవ్ర నిరాశ చెందుతుంటారు.అయితే, ఇటువంటి వారు, ఎవరి కింద పని చేయడం నచ్చని వారు ఈ ఐడియాను పాటిస్తే సొంతంగా నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చును.
ఈ బిజినెస్ తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలను ఆశించవచ్చును. మీరు కూడా ఇలాంటి వ్యాపారం చేయాలని భావిస్తే ఇంకెందుకు ఆలస్యంగా ట్రై చేయండి.. ముందుగా కార్ వాషింగ్ సెంటర్ పెట్టాలంటే రూ.25వేల పెట్టుబడి అవసరం ఉంటుంది. కార్ వాషింగ్ వ్యాపారం అంటే కొందరికి చీప్‌గా అనిపించవచ్చు.కానీ ఇది ప్రొఫెషనల్ బిజినెస్‌గా మారిపోయింది. దీనిలో ఆదాయం కూడా బానే ఉంటుంది. కార్ వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్లు అవసరం. మార్కెట్లో చాలా యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. చిన్నగా వ్యాపారం పెట్టాలనుకునే వారు తక్కువ ఖర్చుతోనే యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. మొదట రూ.14వేలతో యంత్రాన్ని కోనుగోలు చేస్తే చాలు. దీనికి తోడుగా 2 హార్స్ పవర్ ఉన్న యంత్రాలు, పైపులు, నాజిల్స్ అన్ని ఇందులోనే వస్తాయి.
ఇవి కాకుండా రూ. 9 నుంచి10 వేల వరకు అందుబాటులో ఉండే 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను తీసుకోవాలి.ఇక షాంపూ, గ్లౌజులు, టైర్ పాలిష్, డ్యాష్‌బోర్డ్ పాలిష్ వంటి వాషింగ్ ఐటమ్స్ అన్నీ కలిపి దాదాపు రూ.1700 వరకు దొరుకుతాయి. కార్ వాషింగ్ షెడ్‌ను నీటి లభ్యత మంచిగా ఉండే చోట పెట్టుకోవాలి. అందుకోసం స్థలం కూడా పెద్దగా ఉండాలి. ఇరుకు ప్రదేశంలో పెడితే పార్కింగ్ సమస్య వస్తుంది.ఏదైనా మెకానిక్ షాప్ మంచి విస్తీర్ణంలో ఉంటే అక్కడే పెట్టుకుని వారికి అద్దె చెల్లిస్తే సరిపోతుంది.ఇలా చేస్తే డబ్బు ఆదా అవుతుంది.మెకానిక్, వాషింగ్ రెండింటికీ గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కారును బట్టి వాషింగ్ రేట్లు ఉన్నాయి. చిన్న కారుకు 150 నుంచి 500 వరకు .. పెద్దకార్లకు 500 నుంచి 2000 వరకు కూడా ధరలు ఉన్నాయి. ఇవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.