
IPhone : యాపిల్ ఫోన్ అంటే మక్కువ ఎవరికి ఉండదు చెప్పండి. యాపిల్ ఫోన్ కొనాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఐఫోన్‌లో ఉన్న ఫీచర్స్ మరే ఇతర ఫోన్‌లో ఉండవు. అయితే యాపిల్ వరుస ఉత్పత్తులని విడుదల చేసేందుకు సిద్ధమైంది. వార్తా సంస్థల్లో వచ్చిన కథనాల ప్రకారం వచ్చేనెల ప్రారంభంలో భారత మార్కెట్‌లో ఐ-ఫోన్14 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. భారత్‌లో ఐ-ఫోన్ల ఉత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ విడి భాగాల సరఫరా దారులతో ఆపిల్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. వచ్చే దీపావళి నుంచి అంటే అక్టోబర్ 24 నుంచి భారత్‌లో ఐ-పోన్ 14 ఫోన్ల ఉత్పత్తి ప్రారంభం కానున్నది.
కొత్తగా విడుదలయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో ఐ ఫోన్ 14, ఐ ఫోన్ 14 మ్యాక్స్, ఐ ఫోన్ 14 ప్రొ, ఐ ఫోన్ 14 14 ప్రో మ్యాక్స్ వంటివి ఉంటాయి.ఈసారి ఐఫోన్ 12 సిరీస్‌తో ప్రారంభించిన ఐఫోన్ మినీ మోడల్‌ను స్క్రాప్ చేయాలని యాపిల్ నిర్ణయించింది. ఐఫోన్ 14 మినీతో సహా రాబోయే ఈవెంట్‌లో ఆపిల్ ఏడు ఉత్పత్తులను ఆవిష్కరిస్తుందనే అంచనాలు ఉన్నాయి.రాబోయే ఈవెంట్‌లో సెప్టెంబర 7న బ్రాండ్ ఐఫోన్ 14 మినీ, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లను విడుదల చేయనుంది. టాబ్లెట్‌లలో, బ్రాండ్ ఐప్యాడ్ 10.2, ఐప్యాడ్ ప్రో 12.9 మరియు ఐప్యాడ్ ప్రో 11లను కూడా పరిచయం చేస్తుందని తెలుస్తోంది.
Apple IPhone are Manufactures More Products
సెప్టెంబర్ 7న యాపిల్ ఐ ఫోన్లు విడుదలవుతాయని, సెప్టెంబర్ 16 నుంచి అవి స్టోర్లలో అందుబాటులోకి వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇంతకుముందు ఐ-ఫోన్ మార్కెట్‌లో ఆవిష్కరించిన తర్వాత వినియోగదారుల దరి చేర్చడానికి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల సమయం పట్టేది. కానీ ఈ దఫా గడువు తగ్గించడానికి ఆపిల్ ప్రయత్నాలు సాగిస్తున్నది. తైవాన్ అంశంపై అమెరికా, చైనా మధ్య విభేదాలు, భారత్‌తో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇండియాలోనూ ఐఫోన్-14 సిరీస్ ఫోన్ల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆపిల్ నిర్ణయించినట్లు సమాచారం
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.