Business Idea : ఉద్యోగం లేక బాధపడుతున్నారా..ఇలా చేస్తే నెలకు రూ.50వేలు సంపాదించొచ్చు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : ఉద్యోగం లేక బాధపడుతున్నారా..ఇలా చేస్తే నెలకు రూ.50వేలు సంపాదించొచ్చు..?

 Authored By mallesh | The Telugu News | Updated on :26 August 2022,10:00 pm

Business Idea : చదువు పూర్తయ్యాక చాలా మంది ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. కొంతకాలానికి ఉద్యోగంలో చేరితో ఎలాగోలా జీవితంలో స్థిరపడాలని భావిస్తారు. కానీ కొందరికి స్కిల్స్ లేక మరికొందరికీ అదృష్టం కలిసి రాక తమ చదువుకు సంబంధం లేకుండా చిన్న ఉద్యోగాల్లో చేరాల్సి వస్తుంది.కొంతకాలానికి అందులో సంతృప్తి చెందక వేరే జాబ్ కోసం ప్రయత్నిస్తూ తీవ్ర నిరాశ చెందుతుంటారు.అయితే, ఇటువంటి వారు, ఎవరి కింద పని చేయడం నచ్చని వారు ఈ ఐడియాను పాటిస్తే సొంతంగా నెలకు రూ.50 వేలు సంపాదించవచ్చును.

Business Idea : కార్ వాషింగ్, క్లీనర్స్

ఈ బిజినెస్ తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలను ఆశించవచ్చును. మీరు కూడా ఇలాంటి వ్యాపారం చేయాలని భావిస్తే ఇంకెందుకు ఆలస్యంగా ట్రై చేయండి.. ముందుగా కార్ వాషింగ్ సెంటర్ పెట్టాలంటే రూ.25వేల పెట్టుబడి అవసరం ఉంటుంది. కార్ వాషింగ్ వ్యాపారం అంటే కొందరికి చీప్‌గా అనిపించవచ్చు.కానీ ఇది ప్రొఫెషనల్ బిజినెస్‌గా మారిపోయింది. దీనిలో ఆదాయం కూడా బానే ఉంటుంది. కార్ వాషింగ్ కోసం ప్రొఫెషనల్ మెషిన్లు అవసరం. మార్కెట్లో చాలా యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. చిన్నగా వ్యాపారం పెట్టాలనుకునే వారు తక్కువ ఖర్చుతోనే యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. మొదట రూ.14వేలతో యంత్రాన్ని కోనుగోలు చేస్తే చాలు. దీనికి తోడుగా 2 హార్స్ పవర్ ఉన్న యంత్రాలు, పైపులు, నాజిల్స్ అన్ని ఇందులోనే వస్తాయి.

Business Idea Of Car Washing Business In Telugu

Business Idea Of Car Washing Business In Telugu

ఇవి కాకుండా రూ. 9 నుంచి10 వేల వరకు అందుబాటులో ఉండే 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను తీసుకోవాలి.ఇక షాంపూ, గ్లౌజులు, టైర్ పాలిష్, డ్యాష్‌బోర్డ్ పాలిష్ వంటి వాషింగ్ ఐటమ్స్ అన్నీ కలిపి దాదాపు రూ.1700 వరకు దొరుకుతాయి. కార్ వాషింగ్ షెడ్‌ను నీటి లభ్యత మంచిగా ఉండే చోట పెట్టుకోవాలి. అందుకోసం స్థలం కూడా పెద్దగా ఉండాలి. ఇరుకు ప్రదేశంలో పెడితే పార్కింగ్ సమస్య వస్తుంది.ఏదైనా మెకానిక్ షాప్ మంచి విస్తీర్ణంలో ఉంటే అక్కడే పెట్టుకుని వారికి అద్దె చెల్లిస్తే సరిపోతుంది.ఇలా చేస్తే డబ్బు ఆదా అవుతుంది.మెకానిక్, వాషింగ్ రెండింటికీ గిరాకీ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కారును బట్టి వాషింగ్ రేట్లు ఉన్నాయి. చిన్న కారుకు 150 నుంచి 500 వరకు .. పెద్దకార్లకు 500 నుంచి 2000 వరకు కూడా ధరలు ఉన్నాయి. ఇవి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది