Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది పెట్టుబడి పెట్టలేక తమకున్న టాలెంట్ను వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా పాలిటిక్స్ పై అవగాహన లేని యువత కూడా ఉన్నారు. అవగాహనను పెట్టుబడిగా మార్చుకొని అద్భుతాలు సృష్టించవచ్చు. మరో పదిమందిని పెట్టుకొని పని చేపించే స్థాయికి చేరవచ్చు. ప్రస్తుతం అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఖాతాలను ఏర్పాటు చేసుకొని తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఖాతాలని వారి పేరు మీద కనిపిస్తూ ఉన్న వాటిని మెయింటైన్ చేసేవారు వేరే ఉంటారు.
సోషల్ మీడియా ఖాతాలను మైంటైన్ చేయడానికి ప్రత్యేకంగా నిపుణులను నియమించుకుంటున్నారు. ఆ నిపుణుల ద్వారా వ్యక్తిగత ఖాతాలు మాత్రమే కాకుండా వేరువేరు పేర్లతో కూడా ఖాతాలను తెరిచి వారికి తగిన పబ్లిసిటీ లభించేలా వారు చేసే పనులు ప్రజల్లోకి వెళ్లేలా చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు సోషల్ మీడియాపై అవగాహన ఉంటే సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్ గా వ్యవహరించవచ్చు. దీనికి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఇంట్లోనే ఉండి కంప్యూటర్ ముందు కూర్చొని వారు పంపించే ఫోటోలు, ఇతర కంటెంట్ ను ఆసక్తికరంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్ది సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేస్తే చాలు. అయితే ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ పై అవగాహన ఉండాలి. ఈ పని తీరు, పనిచేసే వ్యక్తి స్థాయి ఆధారంగా మీకు ఆదాయం అనేది వస్తుంది.
మొదటగా చిన్న చిన్న స్థాయి వ్యక్తులకు సోషల్ మీడియా అడ్మిన్ గా చేసి పనిలో పట్టు సాధిస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. ఒకేసారి అనేకమంది సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ కింద కొందరిని నియమించుకొని వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. తద్వారా లక్షల్లో సంపాదన ఆర్జించవచ్చు. ఇప్పటికే ఇలాంటి పని చేసే వారిని కలవడం ప్రముఖులను సంప్రదించి అవకాశం కోసం రిక్వెస్ట్ చేయాలి. అవకాశం వస్తే కొన్ని రోజులు ఫ్రీగా పనిచేయడానికి వెనకడుగు వేయవద్దు. ఒక్కసారి మీ టాలెంట్ రుజువైతే తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా లక్షల్లో ఆఫర్ చేసి మిమ్మల్ని ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్ గా నియమించుకుంటారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.