Business Idea : కేవలం ఒక్క కంప్యూటర్ తో.. లక్షల ఆదాయం పొందండి ఇలా…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Business Idea : కేవలం ఒక్క కంప్యూటర్ తో.. లక్షల ఆదాయం పొందండి ఇలా…!

Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది పెట్టుబడి పెట్టలేక తమకున్న టాలెంట్ను వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా పాలిటిక్స్ పై అవగాహన లేని యువత కూడా ఉన్నారు. అవగాహనను పెట్టుబడిగా మార్చుకొని అద్భుతాలు సృష్టించవచ్చు. మరో పదిమందిని పెట్టుకొని పని చేపించే స్థాయికి చేరవచ్చు. ప్రస్తుతం అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఖాతాలను ఏర్పాటు చేసుకొని తమని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 October 2022,8:20 am

Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది పెట్టుబడి పెట్టలేక తమకున్న టాలెంట్ను వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి వారి కోసం బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా పాలిటిక్స్ పై అవగాహన లేని యువత కూడా ఉన్నారు. అవగాహనను పెట్టుబడిగా మార్చుకొని అద్భుతాలు సృష్టించవచ్చు. మరో పదిమందిని పెట్టుకొని పని చేపించే స్థాయికి చేరవచ్చు. ప్రస్తుతం అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఖాతాలను ఏర్పాటు చేసుకొని తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఖాతాలని వారి పేరు మీద కనిపిస్తూ ఉన్న వాటిని మెయింటైన్ చేసేవారు వేరే ఉంటారు.

సోషల్ మీడియా ఖాతాలను మైంటైన్ చేయడానికి ప్రత్యేకంగా నిపుణులను నియమించుకుంటున్నారు. ఆ నిపుణుల ద్వారా వ్యక్తిగత ఖాతాలు మాత్రమే కాకుండా వేరువేరు పేర్లతో కూడా ఖాతాలను తెరిచి వారికి తగిన పబ్లిసిటీ లభించేలా వారు చేసే పనులు ప్రజల్లోకి వెళ్లేలా చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు సోషల్ మీడియాపై అవగాహన ఉంటే సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్ గా వ్యవహరించవచ్చు. దీనికి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఇంట్లోనే ఉండి కంప్యూటర్ ముందు కూర్చొని వారు పంపించే ఫోటోలు, ఇతర కంటెంట్ ను ఆసక్తికరంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్ది సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేస్తే చాలు. అయితే ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ పై అవగాహన ఉండాలి. ఈ పని తీరు, పనిచేసే వ్యక్తి స్థాయి ఆధారంగా మీకు ఆదాయం అనేది వస్తుంది.

Business Idea on Single computer get l of rupees

Business Idea on Single computer get l of rupees

మొదటగా చిన్న చిన్న స్థాయి వ్యక్తులకు సోషల్ మీడియా అడ్మిన్ గా చేసి పనిలో పట్టు సాధిస్తే మంచి అవకాశాలు లభిస్తాయి. ఒకేసారి అనేకమంది సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ కింద కొందరిని నియమించుకొని వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. తద్వారా లక్షల్లో సంపాదన ఆర్జించవచ్చు. ఇప్పటికే ఇలాంటి పని చేసే వారిని కలవడం ప్రముఖులను సంప్రదించి అవకాశం కోసం రిక్వెస్ట్ చేయాలి. అవకాశం వస్తే కొన్ని రోజులు ఫ్రీగా పనిచేయడానికి వెనకడుగు వేయవద్దు. ఒక్కసారి మీ టాలెంట్ రుజువైతే తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా లక్షల్లో ఆఫర్ చేసి మిమ్మల్ని ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాలకు అడ్మిన్ గా నియమించుకుంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది