Business ldea : మామిడి పళ్లు పండిస్తూ సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తోంది ఓ కుటుంబం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200లకు పైగా రకాల మామిడ పండ్లను పండిస్తోంది ఆ కుటుంబం. కేవలం 12.5 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. వారే గుజరాత్ లోని భల్చెల్ గ్రామంలోని ఝారియా కుటుంబం. గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్కు నుండి కేవలం 3 కిలో మీటర్ల దూరంలో ఉంది ఝారియా కుటుంబానికి చెందిన మామిడి తోట. ఈ తోటకు వెళ్తే రకరకాల మామిడి పండ్లు విశేషంగా అలరిస్తాయి. కొంకణ్ నుండి అల్ఫోన్సో మరియు ఉత్తరప్రదేశ్ నుండి దాశేరి రకం మామిడి రకాలు, కేసర్ రకం మామిడి పండ్లు ఈ తోటలో విరివిగా పండుతాయి. 1985లో నూర్ అలీ వీర ఝరియా పొరుగున ఉన్న సంగోద్ర గ్రామం నుండి వలస వచ్చి మామిడిని అభివృద్ధి చేయడానికి భాల్చెల్‌లో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
నూర్ కొన్నప్పుడు ఆ భూమి ఏమాత్రం కూడా సాగుకు యోగ్యమైనది కాదు. ఆ భూమిని సారవంతం చేయడానికి చాలా కాలం కష్టపడ్డాడు. తర్వాత కేసరి మామిడి రకాన్ని పెంచడం ప్రారంభించాడు. అతను మామిడి తోట నుండి ఆశించిన లాభాలను సంపాదించాడు. తర్వాత ఒక్కొక్క రకాన్ని తన తోటలో పండించడం ప్రారంభించాడు. మామిడి పండ్లపైన ఇష్టంతో భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన రకాలు తెచ్చి సాగు చేసే వాడు. ఈ ఇష్టం క్రమంగా ఆయన కుమారుడు సంషుద్దీన్ కూడా కలిగిందని నూర్ మనవడు సుమీత్ చెబుతున్నాడు. ఇప్పుడు ఝారియా కుటుంబం వారి తోటలో 230 రకాల మామిడి రకాలు పండిస్తోంది. కేవలం భారత్ లో దొరికే రకాలే కాకుండా, యూఎస్ఏ, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, యూరప్ మరియు ఇజ్రాయెల్‌లకు చెందిన ఇతర రకాలు కూడా ఉన్నాయి.
ఈ పొలంలో కటిమోన్, బజరంగ్ బరామాసి, బరామసి వల్సాద్ వంటి పండ్ల రకాలు ఉన్నాయి. వారి పొలంలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, వారికి 80 రకాల మామిడి పండ్లు ఉండే చెట్టు ఉంది. ఒకే చెట్టులో వివిధ రకాలను అంటుకట్టారు. ఆ చెట్టు కొన్నేళ్లకు పండ్లను ఇవ్వడం ప్రారంభించింది. కానీ అది ఒక వ్యాధి బారిన పడి చివరికి చనిపోయింది. అనిల్ మ్యాంగో ఫామ్స్ అండ్ నర్సరీ పేరుతో ఏడాదికి దాదాపు 2 లక్షల మామిడి మొక్కలను ఈ కుటుంబం విక్రయిస్తోంది. ఆ మామిడి తోటను ఝారియా ఫ్యామిలీ ఒక మ్యూజియంగా అభివర్ణిస్తుంది. సంవత్సరానికి 24 లక్షల సంపాదిస్తూ మంచి లాభాలు అర్జిస్తున్నారు.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.