Bank Deposit : లక్ష డిపాజిట్ చేస్తే రూ.10 వేలు వడ్డీ… ఈ బ్యాంకు FD ఆఫర్స్ సూపర్ గురూ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bank Deposit : లక్ష డిపాజిట్ చేస్తే రూ.10 వేలు వడ్డీ… ఈ బ్యాంకు FD ఆఫర్స్ సూపర్ గురూ…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2024,12:00 pm

Bank Deposit : ప్రస్తుత కాలంలో చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ శాతం ప్రాధాన్యత చూపిస్తున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన కష్టార్జితం లో కొంచెం పెట్టుబడి పెట్టినట్లయితే భవిష్యత్తులో అది మనకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రస్తుతం చాలామంది బ్యాంకు , పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బ్యాంకులో కూడా కొన్ని ప్రత్యేకమైన వడ్డీ రేట్లు అందిస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు FD ఉంచడానికి కొన్ని బ్యాంకులు మెరుగైన వడ్డీ రేట్లను కూడా అందించడంచడం జరుగుతుంది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుత కాలంలో చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ FD చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్యాంకులలో FD ఉంచడం ద్వారా వారికి అవసరమైనప్పుడు ఆ డబ్బును తీసుకుంటారు. అయితే చాలామంది వడ్డీ ఎక్కడ ఎక్కువగా వస్తుందో తెలుసుకొని ఆ తర్వాత FD ని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారికి ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యాంకు భారతదేశం మొత్తంలోనే అత్యధిక వడ్డీ రేటును అందించే బ్యాంక్ గా పిలవబడుతుంది. అందుకే చాలామంది వినియోగదారులకు ఇది ఎంతో ఇష్టమైన బ్యాంకుగా పేరుపొందింది.

అదే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది దేశంలోనే అత్యధిక FD వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంక్. ఈ బ్యాంకులో మీరు FD ని పెడితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ బ్యాంకులో FD ఫై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ బ్యాంకు సాధారణ పౌరులకు 9.25% వడ్డీ , సీనియర్ సిటిజన్లకు ఎఫ్డిఫై 9.75 వడ్డీని అందించడం జరుగుతుంది.

Bank Deposit లక్ష డిపాజిట్ చేస్తే రూ10 వేలు వడ్డీ ఈ బ్యాంకు FD ఆఫర్స్ సూపర్ గురూ

Bank Deposit : లక్ష డిపాజిట్ చేస్తే రూ.10 వేలు వడ్డీ… ఈ బ్యాంకు FD ఆఫర్స్ సూపర్ గురూ…!

అయితే దేశంలో నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సీనియర్ సిటిజనులకు అత్యధిక వడ్డీ రేటును అందించడం ద్వారా బాగా పాపులర్ అయింది.అయితే మీరు ఈ బ్యాంకులో ఒక లక్ష డిపాజిట్ చేసినట్లయితే 91 నుండి 1080 రోజులకు 6.50% వడ్డీ లభిస్తుంది. అలాగే 181 రోజుల నుండి 545 రోజులకు 9 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు దాదాపు కోటి నుండి 5 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు కలిగి ఉన్న బ్యాంకుగా పేరుపొందింది. అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7 నుండి 14 రోజులకు 3.5% వడ్డీ ,15 నుండి 29 రోజులకు 5% వడ్డీ అందిస్తుంది. మరి మీరు FD ద్వారా అధిక మొత్తంలో వడ్డీని పొందాలంటే ఈ బ్యాంకు సరైనదని చెప్పవచ్చు

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది