Gold and Silver Rate Today 5 March 2026 : మహిళలకు ఎగిరి గంతేసే వార్త.. వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 5 March 2026, 10:00 am

Gold and Silver Rate Today 5 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా చెలరేగిన పసిడి ధరలు, ఇప్పుడు అనూహ్యంగా శాంతిస్తున్నాయి. దేశీయంగా వరుసగా నాలుగో రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో, ఈ రేట్ల పతనం పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. మార్కెట్లో ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? వివిధ నగరాల్లో నేటి లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Gold and Silver Rate Today 5 March 2026 : మహిళలకు ఎగిరి గంతేసే వార్త.. వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం

Gold and Silver Rate Today 5 March 2026 : మహిళలకు ఎగిరి గంతేసే వార్త.. వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం

Gold and Silver Rate Today 5 March 2026 గ్లోబల్ టెన్షన్స్.. అనూహ్య పతనం

ఫిబ్రవరి చివర్లో, మార్చి మొదటి వారంలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర యుద్ధం, మధ్య ఆసియాలో ఉద్రిక్తతల Middle East Tensions నేపథ్యంలో బంగారం రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ప్రభావంతో తులం బంగారంపై ఏకంగా రూ.10 వేలకు పైగా పెరుగుదల కనిపించింది. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గత మూడు, నాలుగు రోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, అమెరికా బాండ్ యీల్డ్స్ US Bond Yields పెరగడం వంటి పరిణామాలు బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక దశలో 5400 డాలర్ల మార్కును అధిగమించినా, ప్రస్తుతం అది 5180 డాలర్ల (ఔన్సుకు) స్థాయికి పడిపోయింది.

Gold and Silver Rate Today 5 March 2026 హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు

గత మూడు రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.8580 పైగా తగ్గడం గమనార్హం. దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల (10 గ్రాములు) మేలిమి బంగారం ధర రూ.1,64,500 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రూ.1,50,790 వద్ద స్థిరపడింది. (నిన్నటితో పోలిస్తే స్వల్ప తగ్గుదల). ఇక 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,23,380 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే 24 క్యారెట్ల ధర రూ.1,64,500 గా, 22 క్యారెట్ల ధర రూ.1,50,790 గా ట్రేడవుతోంది.

బెంగళూరు : 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,64,500 వద్ద, 22 క్యారెట్ల రేటు రూ.1,50,790 వద్ద కొనసాగుతోంది.

చెన్నై: ఇక్కడ 24 క్యారెట్ల పసిడి ధర కాస్త అదనంగా రూ.1,65,810 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ఆభరణాల ధర రూ.1,51,990 గా నమోదైంది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 24 క్యారెట్ల రేటు రూ.1,64,650 వద్ద, 22 క్యారెట్ల ధర రూ.1,50,940 వద్ద కొనసాగుతోంది.

భారీగా కుప్పకూలిన వెండి

బంగారం దారిలోనే వెండి రేట్లు కూడా దారుణంగా పతనమయ్యాయి. కేవలం ఒక్కరోజే కిలో వెండిపై రూ.20 వేల వరకు తగ్గుదల నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ రేటు 95 డాలర్ల స్థాయి నుంచి 84 డాలర్లకు పడిపోయింది.

వివిధ నగరాల్లో నేటి వెండి రేట్లు (1 KG)

హైదరాబాద్: రూ.2,94,900

చెన్నై: రూ.2,94,900

ఢిల్లీ: రూ.2,84,900

బెంగళూరు: రూ.2,84,900

(గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం సమయానికి సంబంధించినవి. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, స్థానిక పన్నులు, తయారీ ఛార్జీలు (మజూరీ) ఆధారంగా జ్యువెలరీ షాపుల్లో ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.)

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి