Today Gold Rate : మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు..ఈరోజు ఎంత ఉందంటే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rate : మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు..ఈరోజు ఎంత ఉందంటే…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 June 2025,2:00 pm

Today Gold Rate : జూన్ 1న బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,310గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 89,200గా నమోదైంది. అలాగే వెండి ధర కిలోకు రూ. 1,10,900గా ఉంది. గడచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా మార్కెట్లలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఒక ఔన్స్‌కు 3280 డాలర్ల వద్ద ట్రేడవుతుండడం గమనార్హం. ఇదంతా బంగారం ధరలు ఆల్ టైం హై నుండి కాస్త దిగి వచ్చేలా చేసింది.

బంగారం ధరలపై ప్రభావం చూపే ముఖ్యమైన అంశాల్లో అమెరికన్ డాలర్ విలువ ఒకటి. డాలర్ బలపడితే, బంగారంపై అంతర్జాతీయ డిమాండ్ తగ్గుతుంది, ఎందుకంటే తక్కువ డాలర్లతో ఎక్కువ బంగారం కొనుగోలు చేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి వెనుకంజ వేస్తారు. మరోవైపు స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ రావడం కూడా బంగారానికి ప్రత్యామ్నాయ పెట్టుబడిగా చూపించడంతో ధరలు తగ్గుముఖం పడతాయి.

Today Gold Rate మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలుఈరోజు ఎంత ఉందంటే

Today Gold Rate : మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు..ఈరోజు ఎంత ఉందంటే…!

భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ ముగిసిన కారణంగా బంగారు ఆభరణాలపై డిమాండ్ తగ్గింది. అలాగే బంగారంపై పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు తమ లాభాలను బుక్ చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈటీఎఫ్‌ల రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు నేడు తనికీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా కేవలం రూ. 3,000 తక్కువగానే ఉండటం గమనించాలి. భవిష్యత్తులో ధరలు ఇంకా తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా అనే అంశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది